తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : TG Cabinet: మంత్రి వర్గ విస్తరణలో ఈ సారి ఎమ్మెల్సీల నుంచి తీసుకునే ఛాన్స్ లేదనే ప్రచారం పార్టీలో ఊపందుకున్నది. రెండు రోజుల క్రితం వరకు కొన్ని పేర్లపై విస్తృతంగా ప్రచారం జరిగినా, కేవలం ప్రజల నుంచి గెలిచినోళ్లనే హైకమాండ్ ఎంపిక చేసే అవకాశం ఉన్నదనే చర్చ పార్టీ సీనియర్లలో జరుగుతున్నది. ఈ దఫా కేవలం ఎమ్మెల్యేగా ఉన్నోళ్లతోనే మంత్రి పదవులు భర్తీ చేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎంపికైనోళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయంతో హైకమాండ్ ఉన్నదని ఓ సీనియర్ నేత ఆసక్తికర విషయం వెల్లడించారు.
ఇప్పటికే స్టేట్ పీసీసీ పంపించిన జాబితాపై హైకమాండ్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ కూడా పలుసార్లు పరిశీలించారు. ఇండివిడ్యువల్ గా ఆయా లీడర్లపై ఫీడ్ బ్యాక్ కూడా సేకరించారు. ఇవన్నీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు పెట్టనున్నారు. ఆయన, మీనాక్షి లు సంయుక్తంగా ఫైనల్ చేసిన వారికే మంత్రి అయ్యే అదృష్టం వరిస్తుందని చర్చ స్టేట్ పీసీసీలో ఉన్నది. అయితే “ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చివరి నిమిషంలోనూ అనేక మార్పులు ఉంటాయి? హైకమాండ్ నిర్ణయాలూ ఒక్కోసారి ఊహకు అందవు”అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
కౌన్సిల్ నుంచి కేటాయిస్తే….?
కౌన్సిల్ లోని సభ్యులకు మంత్రి పదవులు కేటాయిస్తే, భారీగా కాంపిటేషన్ నెలకొంటుందని హైకమాండ్ భావిస్తున్నది. ఒకరికి ఇస్తే మిగతా నేతలంతా తమపై ప్రెజర్ పెడతారని హైకమాండ్ స్టేట్ నేతలకు చెప్తున్నదట. అయితే స్టేట్ ఈక్వేషన్ లో ఇవ్వాలని పీసీసీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ, పీసీసీలు ల మధ్య మంత్రి వర్గ డిబేట్ డిస్కషన్ తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. రాష్ట్ర పరిస్థితులు నేపథ్యంలో కల్పించాల్సిందేనని పీసీసీ పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా, మొదట ఉగాది రోజు పేర్లు ప్రకటన ఉంటుందని పార్టీ నేతలు ప్రచారం చేయగా, ఇప్పుడు ఏప్రిల్ 3న ప్రకటిస్తారని పేర్కొంటున్నారు.
Also Read: TG Govt on LRS: ప్లాట్ యజమానులకు గుడ్ న్యూస్..ఈ అవకాశం మీకోసమే
మిగతా వాళ్ల నుంచి ఒత్తిళ్లు..?
ప్రస్తుతం మంత్రి వర్గ రేసులో ప్రధానంగా ఇటీవల ఎమ్మెల్సీగా ప్రకటించిన విజయశాంతి పేరు వినిపిస్తున్నది. అయితే ఈమెకు మంత్రి పదవి ఇస్తే, మైనార్టీ కోటాలో అమెర్ అలీఖాన్ కు ఇవ్వాలనే చర్చ మొదలవుతుంది. అంతేగాక తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి క్యాబినేట్ లోకి తీసుకోవాలని షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ లు కూడా ప్రెజర్ పెట్టే ఛాన్స్ ఉన్నది.
వీళ్లకు కేటాయిస్తే ఇతర కమ్యూనిటీల్లోని సీనియర్ నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీలో ఫైట్ చేసే ప్రమాదం ఉన్నది.మరోవైపు గతంలో క్యాబినేట్ కేటాయించాలని కోరిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి కోసం పట్టుబట్టే అవకాశం ఉన్నది. ఇవన్నీ పార్టీ గుడ్ ఎన్విరాన్ మెంట్ ను డిస్టర్బ్ చేసేలా ఉండటంతో ఈ దఫా కేవలం ఎమ్మెల్యేల నుంచే మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ భావించినట్లు ఏఐసీసీకి చెందిన ఓ సీనియర్ సభ్యులు ఆఫ్ ది రికార్డులో వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు