తెలంగాణ స్వేచ్చ బ్యూరో:Bhadradi Sitarama Kalyana Mahotsavam: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు TGSRTC శుభవార్త ప్రకటించింది. శ్రీ రామనవమికి భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేకపోతున్నారా? స్వామివారి ఆశిస్సులు పొందలేక పోతున్నామని చింతిస్తున్నారా, మీకు పరమ పవిత్రమైన రాములోరి తలంబ్రాలు కావాలా? ఆ పవిత్రమైన తలంబ్రాలు అందుకోలేక పోతున్నామని ఆలోచిస్తున్నారా, ఇక ఈ ఆలోచనలను పక్కన పెట్టేయండి ఐతే మీకు TGSRTC మంచి అవకాశం కల్పిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని రామాలయాలలో కెల్లా అతి పెద్ద ఆలయం భద్రాద్రి సీతారామాలయం అని అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి దేవస్థానం వెలసింది. హిందువుల అతి ముఖ్యమైన ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామునికి నడయాడిన నేలగా ఈ ఆలయానికి సంభందం వున్నట్లు చరిత్ర కారులు చెప్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.
అయితే శ్రీరాముని కళ్యాణం చూసేందుకు దేశంలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. అయితే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది కూడా భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది.
Also Read: TTD Budget 2025: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి దర్శనం క్షణాల్లోనే..
గత సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్బంగా భద్రాద్రి సీతా- రాముల కళ్యాణ తలంబ్రాలు TGSRTC కార్గో సేవల ద్వారా ఇంటి వద్దకే వచ్చి ఇస్తామని ప్రచారం చేసింది. దీన్ని TGSRTC కార్గోసేవలు భద్రాద్రిలో జరిగిన “సీతారాముల” కళ్యాణ తలంబ్రాలను జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణ ప్రజలకు కేవలం రూ.151/- లకు భక్తుల ఇంటి వద్దకే వచ్చి ఇవ్వనున్నట్లు ప్రచారం చేసింది.
కొన్ని ప్రత్యేక నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. అందుకే ఆ విశిష్టమైన ఆ తలంబ్రాలు తీసుకోవడానికి భక్తులు కూడా ఎక్కువ శాతం ఆసక్తి చూపిస్తుంటారు. కావున భద్రాచలం కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని TGSRTC ఎండి సజ్జనార్ ఒ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్ http://tgsrtclogistics.co.in లో ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040- 69440000 ను సంప్రదిస్తే సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌ల ద్వారా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని సజ్జనార్ తెలియచేశారు. కావున ఈ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సజ్జనార్ తెలిపారు.
Also Read: HMC Fine: రోడ్డుపై చెత్త వేస్తున్నారా జాగ్రత్త.. ఇకపై జేబులకు చిల్లులే