G Kishan Reddy (imagecredit:AI)
తెలంగాణ

G Kishan Reddy: హోంగార్డులకు కొండంత కష్టం.. కేంద్రమంత్రి ఇంటికెళ్లి మరీ!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: G Kishan Reddy: పదేళ్లుగా ఎక్కే గడప ఎక్కుతున్నాం దిగే గడప దిగుతున్నాం. ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, హోం మినిస్టర్లతోపాటు పలువురు నాయకులకు వినతిపత్రాలు సమర్పిస్తూ వస్తున్నాం. ఏ ఒక్కరూ మా సమస్యను పరిష్కరించటానికి చర్యలు తీసుకోలేదు. మీరైనా స్పందించి మాకు న్యాయం చేయండంటూ పలువురు హోంగార్డులు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంగా  ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్​ కు చెందిన 4‌ ‌వందల మందికి పైగా హోంగార్డులుగా విధుల్లో చేరారు.

కాగా, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం నేపథ్యంలో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులను వారి స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు మార్చారు. అయితే, ఆంధ్రకు చెందిన ఇక్కడ పని చేస్తున్న హోంగార్డుల విషయాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. అదే సమయంలో తెలంగాణకు చెంది ఆంధ్రప్రదేశ్​ లో పని చేస్తున్న దాదాపు 4 వందల మంది హోంగార్డులను కూడా ఇక్కడికి పంపించ లేదు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు తమ తమ ప్రాంతాల్లో పని చేయలేయ లేని పరిస్థితుల్లో కుటుంబాలకు దూరమై నిత్యం మానసిక వేదనను అనుభవిస్తున్నారు.

Also Read: BRS 25th Anniversary: బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్.. ఆ ఇద్దరు నేతల గురించే అంతా చర్చ..

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్యాపిల్లల సంరక్షణను చూసుకోలేక ఆవేదన చెందుతున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్​ కు చెందిన తెలంగాణలో పని చేస్తున్న హోంగార్డులకు ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అందక పోతుండటం. కానిస్టేబుళ్ల నియామకాలు జరిగినపుడు ఖాళీల్లో కొంతశాతం హోంగార్డులతో భర్తీ చేస్తారు. అయితే, స్థానికత లేని కారణంగా ఆంధ్రప్రదేశ్​ కు చెంది ఇక్కడ పని చేస్తున్న వారికి ఆ అవకాశం దొరకటం లేదు. ఉన్నతాధికారులను కలిస్తే మీరు ఈ రాష్ట్రానికి చెందినవారు కాదు కాబట్టి ఎలాంటి కోటా ఉండదని చెబుతున్నారని పలువురు హోంగార్డులు వాపోతున్నారు.

ఇక, కుటుంబాలను దూరంగా పెట్టలేక కొందరు హోంగార్డులు భార్యాపిల్లలను ఇక్కడకు తీసుకొచ్చేశారు. ప్రస్తుతం వారి పిల్లలు తెలంగాణలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిల్లలు ఆంధ్రప్రదేశ్​ స్థానికతను కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​ లో పని చేస్తున్న హోంగార్డుల పిల్లలు అక్కడే చదువుకుంటున్న నేపథ్యంలో వాళ్లు తెలంగాణ స్థానికతను కోల్పోతున్నారు. ఈ పరిణామాలు ముందు ముందు తమ పిల్లల భవిష్యత్తుపై గణనీయమైన దుష్ప్రభావాన్ని కనబరుస్తాయని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి తమ తమ స్థానికతను పరిగణలోకి తీసుకుని స్వస్థలాలకు పంపించాలని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు, హోం మంత్రులకు కొన్ని వందలసార్లు విజ్ఞప్తులు చేశామన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ ను కూడా కలిసి తమ గోడును తెలియ చేసుకున్నామన్నారు. కలిసిన ప్రతి ఒక్కరూ సమస్యను పరిష్కరిస్తాం అని చెబుతున్నారు తప్పితే చర్యలు మాత్రం తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Sanjay on KCR: కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.. పెద్ద బాంబే పేల్చారు 

కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం స్థానికత ఆధారంగా హోంగార్డులను వారి వారి సొంత ప్రాంతాలకు పంపించే విషయంలో తమకెలాంటి అభ్యంతరాలు లేవని ఎన్వోసీ జారీ చేసినట్టు తెలిపారు. అయినా, తమ బదిలీలు మాత్రం జరగటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్​ కు చెందిన తమను అక్కడికి పంపించి తెలంగాణకు చెందిన వారిని ఇక్కడికి పిలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు భారం కూడా పడదన్నారు.

తమ బాధలను గుర్తించి సమస్యల పరిష్కారానికి సానుభూతితో చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లిఖితపూర్వక విజ్ఞప్తిని అందచేశారు. తమ సమస్యలు విన్న మంత్రి కిషన్​ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు హోంగార్డులు తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్