Allu Arjun: ఐకాన్ స్టార్ కు మనశ్శాంతి కరువైందా? అందుకే ఆలయాల బాట పట్టి, అంతా సవ్యంగా సాగాలని కోరుకుంటున్నారా? లేక నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం టూర్ ప్లాన్ చేశారా అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్ స్థాయి నుండి అంచెలంచెలుగా హాలీవుడ్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్న హీరో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు వారి ఇంటి నుండి ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే తన నటనతో విమర్శకుల మెప్పు పొందారు అల్లుఅర్జున్. అంతేకాదు నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నారు.
గంగోత్రి సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై, నిన్న విడుదలైన పుష్ప – 2 సినిమా వరకు బన్నీకి ఉన్న క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరింది. తన నటనతో మెప్పించడంలో ఏ మాత్రం మెగా ఫ్యామిలీకి తగ్గని నటుడిగా అల్లు వారింట బన్నీని పేరు గాంచారు. అయితే ఇటీవల బన్నీ చుట్టూ పలు వివాదాలు చెలరేగాయి. పుష్ప – 2 సినిమా పుణ్యమా అంటూ రిలీజ్ రోజు జరిగిన ఘటన బన్నీకి జైలును పరిచయం చేసే వరకు వెళ్లింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బన్నీనే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో బన్నీ వేసుకున్న టీ షర్ట్ గురించి కూడా ట్రోలింగ్ సాగింది. మొత్తం మీద బన్నీ ఒక రాత్రి జైలులో గడిపిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. జాతీయ స్థాయి రేంజ్ ను సంపాదించుకున్న బన్నీ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. కొందరు బన్నీ అరెస్ట్ సబబే అంటే, మరికొందరు వ్యతిరేకించారు.
ఏదిఏమైనా అనుకోకుండా జరిగిన ఘటనతో బన్నీ మనసు చిన్నబుచ్చుకుంది. తండ్రి అల్లు అరవింద్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే నైజం కల వ్యక్తి. బన్నీ అరెస్ట్ సమయంలో అరవింద్ పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఏదిఏమైనా ఈ కేసు వ్యవహారంలో బన్నీకి టాలీవుడ్ అండగా నిలిచిందని చెప్పవచ్చు. సుమారు 20 రోజుల పాటు జరిగిన ఎపిసోడ్ లో బన్నీ నిరంతరం వార్తల్లో నిలిచారు. పుష్ప – 2 సినిమా అఖండ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ సంబరం అనుకోకుండా జరిగిన ఘటనతో బన్నీకి ఏ మాత్రం మిగలలేదనే చెప్పవచ్చు.
Also Read: Tollywood Gossips: టాలీవుడ్ కు ఎన్ని బాధలు? ఒకటి పోతే మరొకటి..
అప్పటి నుండి బన్నీ కాస్త మీడియాకు దూరంగా ఉంటూనే వచ్చారు. తాజాగా బన్నీ అబుదాబిలో కనిపించారు. అక్కడ స్వామి నారాయణ్ మందిర్ ను అల్లు అర్జున్ సందర్శించారు. ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన బన్నీకి, ఆలయ విశిష్టతను ఆలయ ప్రతినిధులు వివరించారు. బన్నీ సైతం ఆలయ విశిష్టతను తెలుసుకొని స్వామి మహిమలను కీర్తించారు. త్వరలో తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి కొత్త ప్రాజెక్ట్ కు బన్నీ సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగుతుండగా, అబుదాబిలో బన్నీ కనిపించడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు బన్నీ అక్కడికి వెళ్ళినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద బన్నీ మళ్లీ అభిమానుల మధ్యలోకి రావాలని, అప్పుడే గతంలో జరిగిన ఘటనలు మరచిపోయే అవకాశం ఉంటుందని అల్లు ఫ్యాన్స్ కోరుతున్నారు.