Raja singh
తెలంగాణ

Raja Singh: రబ్బర్ స్టాంప్ వస్తున్నాడు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్

Raja Singh: తెలంగాణ బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పక్కల్లో బల్లెంలా తయారవుతున్నారు. మనసులో ఏది అనిపిస్తే అది బయటికి చెప్పడంతో రాజాసింగ్ ఏ మాత్రం వెనుకాడడు. అది అవతలి పార్టీ లీడర్లనైనా సరే.. చివరికి సొంత పార్టీ నేతలను అయినా సరే. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. కానీ రాజాసింగ్ కు ఉన్న ఆ క్వాలిటీ ఆ పార్టీ నేతలను తెగ ఇబ్బందిపెడుతోంది. మంచి మైక్ లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి అన్నట్టుగా .. ఎవైనా కంప్లైంట్స్ ఉంటే అంతర్గతంగా చర్చించాలి కానీ అలా బహిరంగ విమర్శలు చేస్తే ఎలా అని ఆ నాయకులు వాపోతున్నారు. అయితే ఎంత కాలితే ఆయన అంతలా మాట్లాడుతారు అని కొందరు అంటుంటే.. ఎంతైనా అలా ఓపెన్ గా విమర్శిస్తే ఎలా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రాజాసింగ్ కు వివాదాలు కొత్త కాదు. ఇటీవలి కాలంలో సొంత పార్టీ నేతల పైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గోల్కొండ జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాను సూచించిన వ్యక్తిని కాదని, మరోకరిని అదీ ఎంఐఎం పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేశారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. పార్టీ తనను లెక్క చేయడం లేదని.. పార్టీకి తానేంటో చూపిస్తానని ఆ సందర్భంగా తెలిపారు. ఇక, ఇటీవల.. కొందరు నేతలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పాత సామాన్లు ఉన్నాయని, వాటిని బయటికి పంపిస్తేనే పార్టీ బాగుపడుతుందని హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని తమ పార్టీకి చెందిన కొంత మంది నేతలు సీక్రెట్‌గా కలుస్తారంటూ ఆరోపణలు చేశారు. అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో టచ్‌లో ఉన్న తమ పార్టీ నేతల వివరాలు తనకు తెలుసని, వారి గురించి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేస్తానని రాజాసింగ్ వెల్లడించారు. ఇక, తాజాగా ఆయన మరో బాంబ్ పేల్చారు.

త్వరలోనే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు వస్తారని చెప్పిన ఆయన… కాబోయే అధ్యక్షుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటే అంతే సంగతి అని అతను రబ్బరు స్టాంపుగానే ఉంటారని అదే జాతీయ నాయకత్వం నిర్ణయిస్తే బాగుంటుందని అన్నారు. గత అధ్యక్షులు వారి కంటూ ఓ గ్రూపు తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారని, రాబోయే వ్యక్తి కూడా అలాంటి వాడే అయితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. అంతటితో ఆగక.. ప్రస్తుతం మంచి నాయకుల చేతులు కట్టి పడేశారని హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ లీడర్లకు తగిన ప్రాధాన్యం కల్పిస్తే.. రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి కార్యకర్తలందరి మనుసులో మాట అని తెలిపారు.

ఇక, ఎదైనా ఉంటే..పార్టీ నేతలకు చెప్పాలే గానీ బహిరంగంగా, మీడియాతో చెప్పొద్దని కొందరు చెబుతున్నారని.. పార్టీ పెద్దల దృష్టికితెచ్చినా వినకపోవడం వల్లే ప్రజల ముందు పెడుతున్నాని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?