10th Hindi Paper Leaked: పదో తరగతి పరీక్షలో సరిదిద్దలేని పొరపాటు.. రేపటి పరీక్షపై ఉత్కంఠ! | 10th Hindi Paper Leaked: పదో తరగతి పరీక్షలో సరిదిద్దలేని పొరపాటు
10th Hindi Paper Leaked
Telangana News

10th Hindi Paper Leaked: పదో తరగతి పరీక్షలో సరిదిద్దలేని పొరపాటు.. రేపటి పరీక్షపై ఉత్కంఠ!

10th Hindi Paper Leaked: ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు (మార్చి 22) జరగాల్సిన హింది పరీక్ష ప్రశ్నా పత్రం ముందుగానే బయటకు రావడం సంచలనం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన 240 మంది విద్యార్థులకు ఈరోజు తెలుగు బదులుగా హిందీ ప్రశ్న పత్రం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది.

ఎలా జరిగిందంటే
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల లో గల పరీక్షా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రేపు జరగవలసిన పదవ తరగతి హింది పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ అయింది. దాదాపుగా 45 నిమిషాల తర్వాత తేరుకున్న అధికారులు హింది ప్రశ్న పత్రాలను వెనక్కి తీసుకుని మళ్ళీ తిరిగి తెలుగు ప్రశ్న పత్రాలను ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రేపు జరగాల్సిన హింది ప్రశ్న పత్రం 240 మంది విద్యార్థుల చేతుల్లోకి వెళ్లడంతో రేపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

Also Read: AP Heatwave Alert: మండుటెండలతో జర భద్రం.. ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు

విచారణకు ఆదేశం
అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం ప్రశ్న పత్రాలు తీసుకు రావడంలో పొరపాటు జరిగినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ 45నిమిషాల వరకు అధికారులు తెరుకోలేక పోయారంటే వారి అలసత్వం వారికి ఇచ్చిన శిక్షణ విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అధికారులపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Just In

01

Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి

Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!

West Bengal Sports Minister: మెస్సీ ఈవెంట్ ఎఫెక్ట్.. క్రీడల మంత్రి రాజీనామా.. ఆమోదించిన సీఎం

Missterious: మిస్టీరియస్ క్లైమాక్స్ అందరికీ గుర్తుండిపోతుంది.. డైరెక్టర్ మహి కోమటిరెడ్డి

IPL Auction Live Blog: రూ.30 లక్షల అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కి రూ.14.2 కోట్లు.. ఐపీఎల్ వేలంలో పెనుసంచలనం