Gautham Ghattamaneni: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల వారసుల అరంగేట్రం కోసం వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అరంగేట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన అనంతరం, చిత్ర పూజా కార్యక్రమాల వరకు వెళ్లింది. కాకపోతే, చివరి నిమిషంలో మోక్షజ్ఞకు వైరల్ ఫీవర్ అంటూ, ఆ సినిమా ప్రారంభోత్సవాన్ని ఆపేశారు. కట్ చేస్తే, అసలా ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని బాలయ్యే డైరెక్ట్ చేస్తారని, అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి.
Also Read- CPI Narayana: మెగాస్టార్ చిరంజీవినే భయపెట్టా.. మీరెంత?.. అంటూ నారాయణ వార్నింగ్
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందని అంటున్నారు. అలాగే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘ఓజీ’ సినిమాలో కూడా అకీరా నటించాడనేలా టాక్ వినబడుతోంది. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. వార్తలైతే బాగానే వచ్చాయి. ఈ మధ్య ‘ఓజీ’ (OG)లో అకీరా ఫైట్ అంటూ ఓ వీడియో కూడా హల్చల్ చేసింది. అకీరా అరంగేట్రానికి సంబంధించి రోజూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్‌లు చేస్తూనే ఉంటారు. ఇక విషయంలోకి వస్తే.. మోక్షజ్ఞ, అకీరా నందన్‌తో పాటు మరో స్టార్ హీరో వారసుడి ఎంట్రీ కోసం, ఆ స్టార్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu). ఆయన వారసుడు గౌతమ్ కృష్ణ.
గౌతమ్ యాక్టింగ్ వీడియో వైరల్.. మహేశ్ అభిమానులు ఫిదా
న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న మహేశ్‌బాబు తనయుడు గౌతమ్.
శిక్షణలో భాగంగా ఓ యాక్ట్‌లో పాల్గొన్న గౌతమ్.
దీనికి సంబంధించిన వీడియో వైరల్.
గౌతమ్ యాక్టింగ్‌కు మహేశ్ అభిమానులు ఫిదా. pic.twitter.com/fzXxJiwxoG— ChotaNews App (@ChotaNewsApp) March 21, 2025
గౌతమ్ యాక్టింగ్‌లోకి వస్తానంటే హ్యాపీ అంటూ మహేష్, నమ్రతలిద్దరూ ఆ మధ్య చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గౌతమ్.. న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే, త్వరలోనే గౌతమ్ ఎంట్రీ ఉంటుందనేది క్లారిటీ వచ్చేసింది. ఇక యాక్టింగ్ స్కూల్‌లో గౌతమ్ నటనకు సంబంధించిన స్కిల్స్‌ని తెలిపేలా వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను మహేష్ బాబు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Also Read- Betting Apps: రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు సంధించిన ప్రశ్నలివే..!
యాక్టింగ్ ఇన్సిస్టిట్యూట్‌లో తోటి విద్యార్థితో కలిసి గౌతమ్ చేసిన స్కిట్ వీడియో ఇది. ఈ వీడియోలో గౌతమ్ నటన చూసిన వారంతా.. వావ్ ఇరగదీశాడు. ఇంత చిన్న వీడియోలో ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ పలికించాడో. ఒక్కో ఎక్స్‌ప్రెషన్‌లో మహేష్ బాబుని మరిపించేశాడు. నిజంగా మహేష్ బాబును చూస్తున్నట్లే ఉంది.. అంటూ ఘట్టమనేని అభిమానులు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. వారు కామెంట్ చేస్తున్నారని కాదు కానీ, నిజంగానే ఈ వీడియోలో గౌతమ్ కొన్ని క్షణాల్లో ఎక్స్‌ప్రెషన్ మారుస్తూ అన్ని రకాల ఎమోషన్స్‌ని పలికించాడు. అతని ఎదురు ఉన్న సహ నటి కూడా చక్కగా పెర్‌ఫార్మ్ చేసింది. మొత్తానికి ఘట్టమనేని వారసుడు నటనలోకి వస్తాడా? రాడా? అని డౌట్స్‌లో ఉన్న వారందరికీ ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక మహేష్ బాబు వారసుడి ఎంట్రీ కోసం, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సృష్టించే సునామీ ఎలా ఉండబోతుందో చూస్తారు.. అంటూ అప్పుడే కొందరు ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కేశారంటే, ఎంతగా అతని ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు