Pareshan Boys Imran: ఇటీవల ఎందరో ప్రాణాలు బలి తీసుకుంటున్న అనధికార బెట్టింగ్ యాప్ లపై సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, ప్రజలను చైతన్య పరిచేందుకు సోషల్ మీడియా వేదికగా ముందడుగు వేశారు. సజ్జనార్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్స్ అభినందనల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ముందుగా వైజాగ్ కు చెందిన లోకల్ బాయ్ నాని వీడియోను పోస్ట్ చేసి, సజ్జనార్ ఇటువంటివి నమ్మవద్దని కోరారు. దీనితో నానిపై వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇక అప్పటి నుండి ప్రారంభమైన బెట్టింగ్ నిర్మూలన ఉద్యమం చిన్నచిన్నగా సెలబ్రెటీల వరకు చేరింది.
ఇది ఇలా ఉంటే నా అన్వేష్ అంటే తెలియని వారుండరు. అన్ని దేశాలు పర్యటిస్తూ.. అక్కడి సాంప్రదాయాలు, వంటలు ఇవన్నీ సమాజానికి పరిచయం చేస్తూ అన్వేష్ యూట్యూబర్ గా సక్సెస్ సాధించారు. అయితే నా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉంటారని చెప్పవచ్చు. సజ్జనార్ మొదలుపెట్టిన బెట్టింగ్ ఉద్యమానికి నా అన్వేష్ బాసటగా నిలిచాడని చెప్పవచ్చు. సజ్జనార్ ను నా అన్వేష్ ఇంటర్వ్యూ చేయడం సంచలనం కాగా, ఆ వీడియోలకు సోషల్ మీడియా స్పెషల్ క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఆ తర్వాత నా అన్వేష్ తన విశ్వరూపం చూపెట్టడం మొదలు పెట్టాడు. ఒక్కొక్క యూట్యూబర్ బెట్టింగ్ చరిత్ర తీస్తూ.. విమర్శలకు పదును పెట్టారు. అందులో ముందుగా హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ పేరు వినిపించింది. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పేరును ఉటంకిస్తూ నా అన్వేష్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆ కామెంట్స్ పైనే ఇప్పుడు ఇమ్రాన్ స్పందించారు. నా అన్వేష్ కామెంట్స్ తో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అంటే తమను ఉద్దేశించి కామెంట్స్ చేయాలని, అంతేకానీ ఇంట్లో మహిళలను తీవ్రపదజాలంతో దూషించడం ఏమిటని ఇమ్రాన్ ప్రశ్నించారు.
Also Read: Betting Apps: రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు సంధించిన ప్రశ్నలివే..!
తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వార సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను సైతం పోస్ట్ చేశాడు. మహిళల జోలికి వచ్చినా, మహిళలను సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసినా సహించేది లేదని సీఎం ఆ వీడియోలో అన్నారు. ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చి, నా అన్వేష్ తన తల్లిని అవమానిస్తూ కామెంట్స్ చేశారని చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ డిమాండ్ చేశారు. అన్వేష్ పై కూడా ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని, వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు . ఈ వీడియోలో ఇమ్రాన్ కన్నీళ్లు కురిపించగా, నెటిజన్స్ భిన్నస్వరాలను వినిపిస్తున్నారు. మొత్తం మీద ఇమ్రాన్ విన్నపం.. సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరుతుందా? చేరితే ఎటువంటి చర్యలు ఉంటాయన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.