తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Development: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు అత్యవసర సేవలనందించటంతో పాటు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి పనులను చేపట్టే జీహెచ్ఎంసీకి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించి గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్తమాన, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో సర్కారు స్టేట్ బడ్జెట్ లో నిధులను కేటాయించింది. తొమ్మిదిన్నరేళ్ల గులాబీ పాలనలో ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ వంటి ప్రాజెక్టుల పనులు సుమారు రూ. వేల కోట్ల విలువైన పనులు జరిగినా, 2015 వరకు మిగులు నిధులతో ఉన్న జీహెచ్ఎంసీ ఆ పనులతో అప్పుల పాలైంది.
మొత్తం రూ. 6553 కోట్ల అప్పులు తీసుకుని ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ పనులు చేపట్టడంతో పాటు మెరుగైన నిర్వహణ అంటూ సుమారు రూ. 1800 కోట్లను వెచ్చించి సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని కూడా తెరపైకి తెచ్చారు. గత గులాబీ సర్కారు హయాంలో జీహెచ్ఎంసీలో రూ. వేలాది కోట్ల విలువైన పనులు జరిగినప్పటికీ, సర్కారు 2014-15 నుంచి 2013 వరకు ప్రతి ఏటా బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి జరిపిన కేటాయింపులు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. కానీ రాష్ట్రంలో సర్కారు మారిన తర్వాత గత సంవత్సరం రూ.2965.61 కోట్లు కొత్త సర్కారు తన ఫస్ట్ బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి కేటాయించింది.
Also Read: Rajiv Yuva Vikasam Scheme: రేషన్ కార్డు కావాలి సార్.. ప్లీజ్ త్వరగా ఇవ్వండి..
ఇక రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26)కు గాను స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి రూ.3101 కోట్లు కేటాయించిన సంగతి తెల్సిందే. గత సర్కారు జీహెచ్ఎంసీకి కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో కేవలం కేటాయింపులు మాత్రమే జరిపిన సర్కారు ఒక్క పైసా నిధులు కూడా మంజూరు చేయని సందర్భాలున్నాయి. కానీ వాస్తవానికి ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ అభివృద్ది కార్యక్రమాలు 2014 లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే ప్రతిపాదనలను సిద్దం చేశారు. ముఖ్యంగా 2014లో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ హయాంలో జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రూ.వెయ్యి కోట్ల మార్కు దాటడంతో అప్పటి సర్కారు అభివృద్ది పనులను వేగవంతం చేసేలా జీహెచ్ఎంసీ పై వత్తిడి పెంచింది.
దీంతో ప్రారంభించిన వివిధ రకాల అభివృద్ది పనులను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఎస్ బీఐ వద్ద అప్పు తీసుకోవటంతో, రూపే టర్మ్ లోన్ లు స్వీకరించటంతో పాటు బాండ్లను కూడా జారీ చేసి అప్పుల ఊబిలోకి జారుకుంది. కనీసం సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఒక క్రమంలో డైలీ న్యూస్ పేపర్ల బిల్లులు చెల్లించకపోవటం, భారీగా బకాయిలు పడటంతో న్యూస్ పేపర్లు వేసేందుకు హాకర్లు సైతం ససేమిరా అన్న సందర్భాలూ ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు సర్కారు అంతంతమాత్రంగా కేటాయింపులు జరిపినప్పటికీ, ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. దీంతో నిర్వీర్యమేయ్య స్థాయికి దిగజారిన జీహెచ్ఎంసీకి కొత్త సర్కారు వర్తమాన, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన కేటాయింపులు, విడుదల చేసిన నిధులతో ఆక్సిజన్ అందించినట్టయింది.
అప్పులు చెల్లిస్తూనే..
స్తోమతకు మించి రూ.6553 కోట్లు అప్పు చేసిన జీహెచ్ఎంసీ పరిస్థితి అప్పు చేసి పప్పుకూడా అన్నట్టు తయారైంది. 2015 నుంచి 2022 వరకు చేసిన అప్పులకు ప్రతి నెల మిత్తీలను చెల్లిస్తూ వచ్చిన జీహెచ్ఎంసీ గత సంవత్సరం 2024 డిసెంబర్ నుంచి అసలు మిత్తీ కలిపి సుమారు నెలకు సుమారు రూ. వంద నుంచి రూ.110 కోట్ల వరకు చెల్లిస్తూనే, ప్రతి నెల కాస్త ఆలస్యమైనా జీతాలు చెల్లిస్తూ కాలం గడుపుతుంది. ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే అధికారులు వామ్మో 1వ తారీఖు అంటూ తలలు పట్టుకున్న పరిస్థితులు నెలకొనేవి.
Also Read: CM Revanth Reddy: ఆ ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న సీఎం.. వెయిట్ అంటూ సూచన
కానీ కొద్ది నెలల క్రితం గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా మూడు నెలల ముందు రూ.3 వేల 30 కోట్లను సర్కారు చెల్లించటంతో జీహెచ్ఎంసీకి కాస్త ఊరట కల్గింది. ఈ భారీ నిధులతో జీహెచ్ఎంసీరాంకీ, సీఆర్ఎంపీ కింద రోడ్ల నిర్వహణ చేపట్టిన ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తుంది. అడగకముందే సర్కారు రూ.3 వేల 30 కోట్లను కేటాయించిందని ఆలోచించకుండానే రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.7208 కోట్ల నిధులు అవసరమవుతాయంటూ జీహెచ్ఎంసీ సర్కారుకు ప్రతిపాదనలు పంపగా, వీటిలో రూ.3101 కోట్లను సర్కారు బడ్జెట్ లో కేటాయించింది. ఇప్పటి వరకు కేవలం రూ.800 కోట్ల అప్పుల అసలు, మిత్తీలను చెల్లించిన జీహెచ్ఎంసీ రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ లో రూ.1300 కోట్లు అప్పుల చెల్లింపులకు కేటాయించింది.
రెండేళ్లలో రూ.4632,42 కోట్లు విడుదల
దీంతో పాటు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో కేటాయించిన రూ.2965.61 కోట్లను వర్తమాన సంవత్సరం 14వ ఆర్థిక సంఘం కేటాయించాల్సిన నిధులు రూ.419 కోట్లు కూడా త్వరలోనే సమకూరే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వర్తమాన, రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో జీహెచ్ఎంసీకి సర్కారు జరిపిన కేటాయింపులు రూ.2965.61 కోట్లు కేటాయించి, 1602.52 కోట్లను విడుదల చేసింది.
దీనికి తోడు 14వ ఆర్థిక సంఘం కింద కేటాయించిన రూ.419 కోట్లు, రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.3101 కోట్లతో కలిపి రూ.6485.61 కోట్లను కొత్త సర్కారు, వర్తమాన, రానున్న ఆర్థిక సంవత్సరాలకు కేటాయింపులు జరిపి, వీటిలో ఇప్పటికే జీహెచ్ఎంసీకి సర్కారు చెల్లించిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.3వేల 30 కోట్లు, రూ.1602.52 కోట్లతో కలిపి ఇప్పటి వరకు 4632.52 కోట్లను ను రిలీజ్ చేసింది. కొత్త సర్కారు రెండేళ్లలో జరిపిన కేటాయింపులు, విడుదల చేసిన నిధులతో జీహెచ్ఎంసీ ఆర్థిక వ్యవస్థ కాస్త గాడీన పడిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.