Balakrishna in Adity 369 (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Aditya 369 Re-Release: డేట్ ఫిక్సయింది.. మళ్లీ హిస్టరీని క్రియేట్ చేస్తుందా?

Aditya 369 Re-Release: ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా మేమే’ అనేది బాలయ్య పాపులర్ డైలాగ్. ఈ డైలాగ్‌తో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బాలయ్య బాబు అభిమానులకు చరిత్రను తిరగరాసే అవకాశం వచ్చేసింది. అవును, నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) నటించిన కల్ట్ క్లాసికల్ చిత్రాన్ని ఎక్కడో నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్‌ల చిత్రాలు మరోసారి రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించాయి. ఇప్పుడా చరిత్రను బీట్ చేసి, సరికొత్త చరిత్రను లిఖించడానికి బాలయ్య కూడా ఈ ట్రెండ్‌లోకి అడుగుపెడుతున్నారు.

అదీ కూడా అలాంటిలాంటి సినిమాతో కాదు. నటసింహం కెరీర్‌లో కలికితురాయిగా నిలిచిపోయిన ‘ఆదిత్య 369’ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో సరికొత్తగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఆ చిత్ర నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మన్ననలను అద్వితీయంగా అందుకున్న సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ మాయాజాలాన్ని ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. అధికారికంగా విడుదల తేదీ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు.

Also Read- Dragon OTT: ‘డ్రాగన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. 4కె‌లో డిజిటలైజ్ చేసి, సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. ప్రసాద్స్ డిజిటల్ టీం అంతా ఆరు నెలల పాటు శ్రమించి మంచి అవుట్ పుట్‌ను ఇచ్చారు. 34 ఏళ్ళ క్రితం 18 జూలై, 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులలో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉందంటే అది ఈ సినిమాకున్న గొప్పతనం. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్‌ చేయగానే ఎంతో మంది విడుదల తేదీ ఎప్పుడు? అంటూ ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్‌డ్ సినిమా. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.

Aditya-369 Re Release Date (Image Source: X)
Aditya-369

ఈ సినిమాను నిర్మించడానికి నాకెంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు జీవితాంతం రుణపడి వుంటాను. ఇంత గొప్ప ప్రాజెక్టుతో నా స్థాయిని పెంచిన నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావులకు.. ఈ సినిమా రీ రిలీజ్ విషయం చెబితే వారు కూడా ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా.. రెండు పాత్రల్లోనూ ఇందులో బాలయ్య అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాలో చాలా అందంగా కనపడతారు. కథకుడిగా, దర్శకుడిగా సింగీతం అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిత్రమిది. ఇటువంటి కథా ఆలోచన ఆయనకు రావడమే కాదు, తెలుగు తెరపై అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నభూతో నభవిష్యత్ అనే తరహాలో ఈ సినిమాకు తెరరూపమిచ్చారు.

Also Read- Star Heroine: బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. చర్యలు తీసుకుంటారా?

ఇళయరాజా సంగీతం, జంధ్యాల మాటలు, ముగ్గురు సినిమాటోగ్రాఫర్ల (పీసీ శ్రీరామ్ ‌- వీఎస్ఆర్ స్వామి – కబీర్ లాల్‌) కెమెరా వర్క్ ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నాం. నందమూరి ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక అని భావిస్తున్నాం. ఇప్పటి వరకు నిర్మాతగా 15 సినిమాలు చేశా. ఎన్ని హిట్ సినిమాలు తీసినా.. నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ఏదంటే ‘ఆదిత్య 369’ అనే చెబుతాను. మా బ్యానర్ శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రమిది. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న బాలయ్య బాబు పరంపరను కొనసాగిస్తూ.. ఈ సినిమా కూడా మరోసారి ప్రేక్షకాదరణ పొంది ఆయన హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!