Tuk Tuk Pre Release Event: ఒక వారం రోజులుగా టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న పేరు ‘టుక్ టుక్’. ఫాంటసీ, మ్యాజికల్ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవడంతో.. మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న కార్‌స్కూటర్ గురించి మేకర్స్ చెబుతున్న విశేషాలు.. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని వెయిట్ చేసేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు మంచి ఆసక్తిని కలిగించే కంటెంట్ ఇందులో ఉండటంతో.. నార్మల్‌నే ఈ సినిమా వార్తలలో ఉంటుంది.
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 21న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ముఖ్యంగా ఈ వేడుకలో ఇటీవల విడుదలై, మంచి సక్సెస్ సాధించిన ‘కోర్టు’ సినిమా ప్రస్తావన రావడం హైలెట్‌గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Manchu Lakshmi: సజ్జనార్‌గారూ.. మంచు అక్కని ఎలా వదిలేశారు?
ఈ కార్యక్రమంలో దర్శకుడు సుప్రీత్ సి కృష్ణ మాట్లాడుతూ.. ‘కోర్టు’ సక్సెస్ మా సినిమాపై కచ్చితంగా ఉంటుందని అన్నారు. అదెలాగో తెలియాలంటే ఆయనేం మాట్లాడారో తెలుసుకోవాలి. ‘‘ఇప్పటి వరకు ‘టుక్ టుక్’కు సంబంధించి విడుదల చేసిన టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. అన్నింటినీ ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మార్చి 21న అందరూ ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న తెలుగు సినిమాను చూడబోతున్నారు. ఓ కమర్షియల్ ప్యాకేజీలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది.
ఓ యాడ్‌లో వాడిన వెహికల్ చూసిన తర్వాత నాకు ఈ ‘టుక్ టుక్’ ఐడియా వచ్చింది. ఈ కాన్సెప్ట్‌ను ఒక ఫ్రాంఛైజీగా, యూనివర్శ్‌గా బిల్డ్ చేయాలనే ఆలోచన ఉంది. అది ఈ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటించాడు రోషన్. ఆయన నటించిన ‘కోర్టు’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్ పాత్ర చాలా బాగుంటుంది. రోషన్ ద్వారా ‘కోర్టు’ సక్సెస్ వైబ్ మా సినిమాపై కూడా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు చెప్పుకొచ్చారు.
Also Read- 12A Railway Colony: అల్లరి నరేష్ సినిమా.. స్పైన్ చిల్లింగ్ టీజర్‌తో టైటిల్ రివీల్
హీరోయిన్ శాన్వీ మేఘన మాట్లాడుతూ.. రీసెంట్‌గా ‘కుడుంబస్తాన్’ అనే తమిళ సినిమాలో చేసిన పాత్రకు చాలా మంచి స్పందన వచ్చింది. ఓటీటీలో తెలుగులో విడుదలైన ఆ సినిమాను తెలుగు వాళ్లు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు ‘టుక్‌టుక్’తో మీ ముందుకు వస్తున్న ఈ తెలుగమ్మాయిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను దర్శకుడు ఎంతో అందంగా తెరకెక్కించారు. ఈ ఫాంటసీ సినిమా ఫ్యామిలీతో పాటు యూత్ ఇలా అందరినీ అలరిస్తుంది. అటువంటి కంటెంట్ ఇందులో ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మా టీమ్ అంతా ఉన్నామని ఆమె తెలిపారు. మార్చి 21న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు నిర్మాతలలో ఒకరైన రాహుల్ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో నిహాల్ కోదాటి, వాణి శాలిని, మౌనిక, మధు వంటి వారు ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు