CM Revanth reddy
తెలంగాణ

CM Revanth reddy: అయ్యింది ఇంటర్వెల్లే… కేసీఆర్ పాపాల చిట్టా ఇంకా విప్పుతా! రెచ్చిపోయిన రేవంత్

CM Revanth reddy:  ఓరుగల్లుకు గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతమని, ఎంతోమంది ఉద్యమకారులు, మేధావులకిది పుట్టినిల్లు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. సమస్యల పైన పోరాటం చేయడమే కాదు, ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని వీరులు పుట్టిన గడ్డ అని గుర్తుచేశారు. ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి సుమారు రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందజేశారు. అలాగే మహిళా శక్తి పథకం ద్వారా లబ్ధిదారులకు 7 ఆర్టీసీ బస్సులు అందించారు. ఈ సందర్భంగా.. అభివృద్ధిలో హైదరాబాద్ కు పోటీపడేలా వరంగల్ దూసుకుపోతోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మామునూరు విమానాశ్రయం, వరంగల్ జౌటర్ రింగ్ రింగు రోడ్డు తదితర అభివృద్ధి పనులకు అనుమతులు లభించాయని పేర్కొన్నారు.

అనంతరం స్టేషన్ ఘన్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుద్దేశించి.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చేశారని విమర్శించారు. బ్యాంకుల నుంచి రూ. 7లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, మిగతావి కూడా కలుపుకుంటే సుమారు రూ. 8.29 లక్షల కోట్లు బాకీ పడ్డట్లు తేలిందని తెలిపారు. ఆదాయమంతా గతంలో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడానికే సరిపోతుందన్నారు. మిగులు లేకపోవడం వల్ల ప్రజలకు మంచి చేయడంలో కాస్త వెనుకబడ్డామని, అయినా కూడా ఎన్ని కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒకవైపు పాపాల పుట్ట లాగా రాష్ట్రంలో అప్పులు పెరిగితే, కేసీఆర్ ఆస్తులు మాత్రం లక్ష కోట్లు పెరిగాయని ఆరోపించారు.

Also Read: Balineni vs YCP: బాలినేనితో సినిమా.. మాస్టర్ ప్లాన్ వేసిన వైసీపీ..

పిక్చర్ అబీ బాకీ హై..

అధికారం ఉంటేనే ఉంటా..లేకుంటే ఫార్మ్ హౌస్ లో పంటా అన్నట్లు కేసీఆర్ తీరు ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. అధికారం శాశ్వతం అనుకున్నారని, అందుకే ఇప్పుడు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నారని అసెంబ్లీకి కూడా రావడం లేదని విమర్శించారు. నెలకి 3.92 లక్షల జీతం తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాల చిట్టాను ఇంకా విప్పుతానని, ఇప్పటికి చెప్పింది ఇంటర్వెల్ వరకేనని ఇంకా బాకీ ఉందని హెచ్చరించారు. 19,20 తేదీలలో అసెంబ్లీలో కేసీఆర్ కు మిగతా సినిమా చూపిస్తానన్నారు.

పిల్లకాకులు..

ఇక, హరీశ్ రావును ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. ‘‘కేసీఆర్ జాతిపిత అని హరీశ్ రావు అంటున్నారు. ఈ జాతిపిత మందు వాసన లేనిదే నిద్ర లేవడు. త్యాగం చేసిన వారికి, తాగుబోతులకి తేడా లేదా? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి, తెలంగాణను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు. హరిశ్ రావుకు ఈ విషయం కూడా తెలియదా?’’ అని ఎద్దేవా చేశారు. పిల్ల కాకులతోని నాకెందుకని, డైరెక్ట్ కేసీఆర్ తోనే మాట్లాడతానని, పిల్ల కాకికి ఉండేలు దెబ్బ తెల్వదన్నారు. కేసీఆర్ ఎక్కడికొస్తడో రావాలి చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.

అభివృద్ధి పనుల వివరాలు

రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు
రూ.45. 5 కోట్లతో ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు
రూ.26 కోట్లతో ఘన్‌పూర్ లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం
రూ.148.76కోట్లతో దేవాదుల రెండో దశ
దశ- RS ఘన్‌పూర్ లో 12.650 నుంచి 31.20(T.E) కిలోమీటర్ల మధ్య RS ఘన్‌పూర్ ప్రధాన కాలువకు CC లైనింగ్, ప్రధాన కాలువలు మరియు CM&CD పనుల నిర్మాణం
రూ.25.6 కోట్లతో 512 ఇందిరమ్మ ఇండ్ల(యూనిట్‌కు రూ.5 లక్షలు) మంజూరు
274 ఇండ్లు ఘన్‌పూర్ నియోజకవర్గ మండలాలకు
238 ఇండ్లు ధర్మసాగర్ & వేలైర్ మండలాలకు
రూ.15 కోట్లతో R/F NH రహదారి నుండి మల్లన్నగండి నుండి తాటికొండ, జిట్టగూడెం (Stn)నుంచి తరిగొప్పుల వరకు రహదారి విస్తరణ (ఇంటర్మీడియట్ లేన్).
రూ.23.5 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్వహణ-BT పునరుద్ధరణ (36.30KMలు)
R/F జనగాం నుంచి జీడికల్, లింగాల ఘపూర్ (M) (14KMs)
R/o జఫర్‌గఢ్ X రోడ్డు నుంచి జఫర్‌గఢ్ మండలం వెబ్కటపూర్ X రోడ్డు (14.70 కిమీలు)
R/F నిడిగొండ నుంచి క్విలేషాపూర్, రఘునాథపల్లి (M) (7.60 KMs)
రూ. 1 కోటితో స్టేషన్ ఘన్‌పూర్‌లో NPDCL డివిజనల్ ఆఫీస్ కమ్ ERO ఆఫీస్ భవనం నిర్మాణం
రూ.2.26 కోట్లతో రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్ ఏర్పాటు
రూ.2.29 కోట్లతో జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామం వద్ద 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు
రూ.2.5 కోట్లతో చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు
రూ.2.48 కోట్లతో రఘునాథపల్లెలోని ఫతేషాపూర్ గ్రామం వద్ద 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు
రూ.1.48 కోట్లతో ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం
రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం
రూ.11.9 కోట్లతో గోవర్దనగిరి నుంచి చర్లతండా వరకు రోడ్డు నిర్మాణం
రూ.3.7కోట్లతో నక్కపొక్కల తండా సామ్యకుంట తండా నుంచి రఘునాథపల్లిలోని దుర్గాతండా పోతరాజుగండి తండా వయా నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
రూ.3.49 కోట్లతో సేవ్య తండా & అబ్దుల్ నగర్ మీదుగా ఫతేపూర్ నుండి కచేర్ తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
రూ.2.8 కోట్లతో ఫతేషాపూర్ గ్రామం లక్ష్మి తండా మీదుగా, రఘునాథపల్లి మండలంలోని రామచంద్ర గూడెం వరకు నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
స్టేషన్ ఘన్‌పూర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం
రూ.1.76 కోట్లతో కుడా ఆధ్వర్యంలో పెద్దపెండ్యాల గ్రామంలో రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు
రూ.102.1 కోట్లతో మహిళా శక్తి కింద7 RTC బస్సులు మంజూరు (రూ.2.10 కోట్లు), స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజ్
రూ.0.65 కోట్లతో ఘన్‌పూర్ లో తెలంగాణ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రం ఏర్పాటు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?