Bhatti Vikramarka - Palla Rajeshwar
తెలంగాణ

Bhatti Vikramarka – Palla Rajeshwar: కొత్త తరహాలో పథకాల ప్రచారం.. ప్రతి సమాచారం ప్రజల ముందుకే.. భట్టి.

Bhatti Vikramarka – Palla Rajeshwar: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బీఆర్ఎస్ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క వివరంగా సమాధానమిచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో గత ప్రభుత్వ(BRS) హయాంలో ఐదు సంవత్సరాల్లో అంటే 2018 23 వరకు కేవలం రూ. 124 కోట్లు రుణమాఫీ(Runamafi) చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే 263 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. గజ్వేల్ లో 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 104.3 కోట్ల రుణమాఫీ చేసిందని, తమ ప్రభుత్వం రూ. 237. 33 కోట్లు చేసిందని పేర్కొన్నారు.

అలాగే హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో 2018 లో అప్పటి ప్రభుత్వం రూ. 96.62 కోట్లు మాఫీ చేసిందన్నారు. అదే తమ సర్కారు వచ్చిన వెంటనే అదే సిద్దిపేటలో రూ. 177.91 కోట్లు మాఫీ చేసినట్లు గణాంకాలతో తెలిపారు. అలాగే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా అదే పరిస్థితి అని భట్టి వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో రూ. 101.76 కోట్ల రైతు రుణం మాఫీ అయిందని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిలోనే రూ. 175.84 కోట్లు మాఫీ చేసిందని చెప్పారు.

Also Read: 

CM Revanth Reddy: కేసీఆర్ ను సభకు రప్పించండి… స్పీకర్ తో సీఎం రేవంత్

తమ ప్రభుత్వం రైతు రుణమాఫీని సవ్యంగా చేపట్టినప్పటికీ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. కాబట్టే శాసనసభ ప్రాంగణంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా కు సంబంధించిన సమాచారాన్ని డిస్ప్లే చేయనున్నట్లు ప్రకటించారు. అలాగేప్రతి సంక్షేమ పథకం వివరాలను లెక్కలతో సహా ఎమ్మెల్యేలకు ఇస్తామని, వాటిని గ్రామాల వారీగా ఫ్లెక్సీ లపై డిస్ప్లే చేస్తామని తెలియజేశారు. రైతు రుణమాఫీ మాత్రమే కాదు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి స్కీంకు సంబంధించిన వివరాలు లెక్కల తో సహా ఇస్తామని వెల్లడించారు. వారి లాగా పనులు చేయకుండా తాము ప్రచారం చేసుకోవడం లేదని విమర్శించారు.

వర్సిటీల్లో వీసీలుగా బడుగులకు ఛాన్స్ ఇచ్చాం..

గత ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్సిటీలను గాలికి వదిలేస్తే తాము 12 మంది వీసీలను నియమించామని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలను సైతం తీసుకున్నమన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళితుణ్ని వీసీగా చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మహిళ యూనివర్సిటీకి బీఆర్ఎస్ వాళ్లు ఎప్పుడైనా వెళ్లారా? అని ఎద్దేవా చేశారు. తాము ఆ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని, అంతేగాక అక్కడి వారసత్వ భవనాల మరమ్మతుకు 15 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇవి కాకుండా 540 కోట్లు బిల్డింగులు కట్టడానికి వెంటనే ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఇది తమ ముఖ్యమంత్రి కమిట్మెంట్ అన్నారు.

ఇక, రాష్ట్రంలో న భూతో న భవిష్యతి అన్నవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి గారికి సమయం లేదు విద్యాశాఖను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షం విమర్శిస్తోందని, అది సరైనది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి  విద్యా శాఖకు చేస్తున్న సేవలు చూస్తే గర్విస్తున్నామన్నారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?