Ganja Seized: హోలీ పండుగ వేళ గంజాయి స్వీట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో కుల్ఫీ ఐస్ క్రీమ్ ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోలీ వేడుకల్లో ఐస్ క్రీమ్ లో గంజాయిని మిక్స్ చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్తో పాటు గంజాయి బాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి 100 కుల్ఫీ గంజాయి చాక్లెట్స్.. 72 గంజా బర్ఫీ స్వీట్స్ లభ్యమైనట్లు తెలుస్తోంది.
హోలీ ముసుగులో గంజాయి దందా..
STF దాడుల్లో విస్తుపోయే విషయాలు
గంజాయితో కుల్ఫీ ఐసి క్రీమ్ తయారీ
ధూల్ పేట్ లోని మల్చిపురాలో గంజాయి ఐస్ క్రీమ్ దందా
గంజాయి మిక్స్ చేసి కుల్ఫీలు అమ్ముతున్న సత్యనారాయణ సింగ్ pic.twitter.com/MSBnR2dgLk
— BIG TV Breaking News (@bigtvtelugu) March 14, 2025
నగరంలోని పాతబస్తీలో ఈ వ్యవహారం గంజాయి గుట్టు బయటడింది. హోలీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అదేవిధంగా నగరంలోనూ ప్రజలంతా జాలీగా హోలీ జరుపుకుంటున్నారు. కానీ… లోయర్ ధూల్పేట్లోని మల్చిపురాలో మాత్రం పండుగ వేడుకల్లో భాగంగా.. మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులకు సమాచారం అందింది. పండుగ పేరుతో మిఠాయిలు పంచుకుంటున్నట్లు కలరింగ్ ఇచ్చి… కుల్ఫీ ఐస్ క్రీమ్ లో, బర్ఫీ స్వీటులో గంజాయిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. స్వీట్లలో సిల్వర్ కోటెడ్ బాల్స్ రూపంలో గంజాయి పెట్టుకున్నట్లు పసిగట్టారు.
మత్తుపదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటుండటం కలవరపెడుతోంది. ఇటీవలి కాలంలో గంజాయి చాక్లెట్ల అంశం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గంజాయి ఐస్ క్రీముల వ్యవహారం రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
Also Read:
Kurnool District: ఆ ఊళ్లో జంబలకిడి పంబే.. ఈ వింత ఆచారం ఎందుకంటే?
TGPSC Group 3 results 2025: గ్రూప్-3 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి