TGPSC Group 3 results 2025
తెలంగాణ

TGPSC Group 3 results 2025: గ్రూప్-3 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TGPSC Group 3 results 2025: తెలంగాణలో గ్రూప్ -3 ఫలితాలు విడుదలయ్యాయి.  రాత పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇందులో భాగంగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు విడుదల చేశారు. కాగా, 1365 పోస్టులకు గాను 2022 డిసెంబర్ 30 న టీజీపీఎస్సీ గ్రూప్ 3  నోటిఫికేషన్ ఇచ్చింది.  గత ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో పరీక్షను నిర్వహించింది.  గ్రూప్ 3 పోస్టులకు మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 50.24 శాతం మంది రాత పరీక్షకు హాజరయ్యారు.

107 శాఖల పరిధిలో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ఆడిటర్ పోస్టులకు రాత పరీక్షను నిర్వహించారు. వీటిలో  ఆర్థికశాఖలో అత్యధిక పోస్టులు ఉన్నాయి.

కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వరుసగా పెండింగ్ లో ఉన్న ఫలితాలను వెల్లడిస్తున్నది. ముందుగా గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించి. రీ కౌంటింగ్ ప్రక్రియకు వెసులుబాటు కల్పించింది. గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించిన మరునాడే… గ్రూప్ 2 రిజల్ట్స్ విడుదల చేసింది. తాజాగా గ్రూప్ 3 ఫలితాలు కూడా వెల్లడి కావడం విశేషం.

గ్రూప్ 3 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ఫలితాలను చెక్ చేసుకునేందుకు ముందుగా గ్రూప్ 3 అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ హోం పేజీలో గ్రూప్ 3 సర్వీస్ జనరల్ ర్యాకింగ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు వెంటనే పీడీఎఫ్ ఫార్మాట్‌ వివరాలు ఓపెన్ అవుతాయి.అందులో మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు స్కోర్ వివరాలు కనిపిస్తాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కాపీని పొందవచ్చు. ఏదైనా సమస్య ఉంటే టీజీపీఎస్పీని సంప్రదించవలసిందిగా అధికారులు కోరారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!