Court Movie Review
ఎంటర్‌టైన్మెంట్

Court Movie Review: కోర్ట్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

టైటిల్‌: ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ
నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులు
సమర్పణ: నాని
నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: దినేష్‌ పురుషోత్తమన్‌
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
విడుదల తేది: 14 మార్చి, 2023

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
కథ, దర్శకత్వం: రామ్ జగదీష్

Court Movie Review: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రజెంట్ చేసిన చిత్రం ‘కోర్ట్’. నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఈ మూవీలో నటించాడు. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే 2 రోజుల ముందే ప్రత్యేక ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ మూవీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ : వైజాగ్‌లోనే ఒక చిన్న కాలనీలో చంద్రశేఖర్ (హర్ష్ రోషన్) నివసిస్తూ ఉంటాడు. 19 ఏళ్ల వయసులోనే అతడికి ప్రేమ పుడుతుంది. జాబిలి(శ్రీదేవి ఆపళ్ళ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. జాబిలి మేనమామ అయిన మంగపతి(శివాజీ)కి జాబిలి అంటే చాలా ఇష్టం. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం మంగపతికి తెలుస్తుంది. ఎలాగైనా వీరి ప్రేమని విడగొట్టాలని చూస్తాడు. ఇక మంగపతికి తెలిసిన లాయర్ దాము (హర్షవర్ధన్) సాయంతో చంద్రశేఖర్‌పై లేని పోనీ సెక్షన్ల కింద కేసులు పెట్టిస్తాడు.

దీంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేస్తారు. ఇక కేసును వాదించడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడే లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) ఆ కేస్ టేకప్ చేస్తాడు. అసలు విషయం ఏంటనేది పూర్తిగా తెలుసుకుంటాడు. ఈ కేసుకు సంబంధించిన విషయాలన్ని కూడా సేకరిస్తాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ కేసుని సూర్య తేజ ఎలా వాదించాడు? చంద్రశేఖర్ నిర్దోషి అని ఎలా నిరూపించగలిగాడు? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ కోర్టు డ్రామా చిత్రం.

విశ్లేషణ: డైరెక్టర్ రామ్ జగదీశ్ ‘కోర్ట్’ స్టోరీ ఏంటి? అనేది ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీ ఇంటర్వెల్ ముందు మంగపతి స్వభావం ఎలాంటిది? అసలు చంద్రశేఖర్, జాబిలి లవ్ ఎలా మొదలువుతుంది? అనే అంశాల చుట్టూనే డిజైన్ చేసుకున్నాడు. సూర్య తేజ కేసుని టేకప్ చేయడంతో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అప్పటి వరకు వచ్చిన ప్రేమ కథ నిబ్బా, నిబ్బిలా ట్రాక్ మాదిరి అనిపిస్తుంది.

ఒక దశలో వారిపై కోపం కూడా వస్తుంది. మంగపతే వీళ్ళకి కరెక్ట్ అనే భావం కలుగుతుంది. మరోపక్క 19 సంవత్సరాల కుర్రాడిగా కనిపించిన చంద్రశేఖర్ పై కూడా ఆడియన్స్‌కు ఎటువంటి సింపతీ కలగదు. ఆయనపై ఆపొనెంట్ లాయర్ పెట్టే కేసులు.. వాటిని అతను వాదించే విధానం.. అన్నీ సింపుల్‌గానే అనిపిస్తాయి. హీరో వీటిని పరిష్కరించవచ్చు అనే ఆలోచన కూడా మైండ్‌లోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ ఇక్కడ డైరెక్టర్‌కి వేరే మార్గం లేదు.

కోర్టులో ప్రియదర్శి కేసుని ఎలా వాదిస్తాడు అనే లైన్ పైనే ఇంటర్వెల్ తరువాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఆపొనెంట్ లాయర్ ఓ మెలిక పెడతాడు. అది పరిష్కరించలేనిది అని హీరో కూడా చేతులెత్తేసి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఇదే మూవీకి హైలెట్ అయ్యింది. చివరి 40 నిమిషాలు డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. అందువల్ల అప్పటి వరకు విసుగు అనిపించిన సినిమా ఒక్కసారిగా ఆసక్తికరంగా మారి, ఎక్కువ మార్కులతో పాసైపోతుంది. సాంకేతకంగా స్టోరీకి ఎంత అవసరమో వాటినే నిర్మాతలైన నాని, ప్రశాంతి సమకూర్చారు. అవి ఎక్కడా లోటు అనిపించవు. అంతకు మించి అవసరం లేదు కూడా. మొత్తంగా అయితే ‘జై భీమ్’ అంత గొప్ప సినిమా కాదు కానీ చివరి 40 నిమిషాల సినిమాతో ఈ ‘కోర్ట్’ జడ్జిమెంట్ పర్వాలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :
శివాజీ పెర్ఫార్మెన్స్
కోర్ట్ సీన్స్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్

కొన్ని లాగింగ్ సీన్లు

ట్యాగ్‌లైన్: తీర్పు సంతృప్తినిస్తుంది

రేటింగ్ : 2.75/5

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు