meenakshi chaudhary
ఎంటర్‌టైన్మెంట్

Actress: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి.. ఆ లక్షణాలు ఉండాల్సిందేనట!

Actress: మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకంటూ ప్రత్యేకమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ‘అప్‌స్టార్ట్‌లు’ అనే చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తరువాత ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్.దర్శన్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ అనే చిత్రంలో నటించింది.

ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీలో నటించింది. దుల్కర్ సల్మాన్‌కి జంటగా మీనాక్షి చౌదరి యాక్ట్ చేసింది. ఈ మూవీ భారీ హిట్‌ని సొంతం చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తరువాత మట్కా, మెకానిక్ రాకీ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకుంటుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌ని సొంతం చేసుకుంది. హీరో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీతోనే మీనాక్షి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు మూవీస్‌కి గ్రీన్ సిగంల్ ఇచ్చింది. వరుసగా మూవీస్ చేస్తూ దూసుకెళ్తోంది.

మరోవైపు షాప్స్ ఓపెనింగ్స్ కూడా అటెండ్ అవుతూ అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుతుంది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనేది వివరించింది. తనకు భర్తగా రావాలంటే.. తనలాగే మనస్తత్వం ఉండాలని చెప్పింది. తన ఆలోచనలు.. తనకు కాబోయే హస్బెండ్ ఆలోచనలు సేమ్ ఉండాలని పేర్కొంది. ఇలాంటి వ్యక్తి దొరుకుతే మాత్రం పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.

అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కోసం వెయిట్ చేస్తానని.. అలాంటి వాడు దొరికిన వెంటనే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. మూవీస్‌లో సింపుల్‌గా తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. గ్లామర్ పాత్రలు కాకుండా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీకు నచ్చిన భర్త ఖచ్చితంగా వస్తాడని అంటున్నారు. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ.. తన పర్సనల్ విషయాలతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

Also Read: డైరెక్టర్ కోసం మూడు రాత్రులు గడిపాను: స్టార్ హీరోయిన్

Meenakshi Chaudhary

ఇక మీనాక్షి చౌదరి హరియాణాలోని పంచ్​కులా అనే ప్రాంతంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే చాలా యాక్టీవ్ గా ఉండేది. మల్టీ టాలెంట్‌తో అన్ని రంగాల్లో రాణిస్తూ వస్తుంది. స్కూల్ సమయంలో క్రీడల్లో సత్తాచాటింది. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని బహుమతులు, ఎన్నో మెడల్స్ గెలుపొందింది. పలు అందాల పోటీల్లో ఈ బ్యూటీ.. ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, మిస్ ఇండియా పేజెంట్ వంటి టైటిల్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు పంజాబ్‌లో నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్‌లో డెంటిస్ట్‌గా కోర్స్ పూర్తి చేసి.. డెంటిస్ట్ గా కూడా పని చేసింది. ఆ తర్వాత చిన్న సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం వరుస మూవీస్ తో దూసుకెళ్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఆఫర్లు దక్కించుకుంటుంది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?