SLBC Rescue: ఇప్పటికి 18 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్(Slbc tunnel) లో రెస్క్యూ ఆపరేషన్స్(rescue operations) కొనసాగుతున్నాయి. టన్నెల్ రెస్క్యూ… కొమ్ములు తిరిగిన ఆర్మీ(Army), ఎన్డీఆర్ఎఫ్(NDRF) వంటి బృందాలకే ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలే సొరంగం, అందులో బోరింగ్ మిషన్ కూలిపోవడం, నీరు ఉబికి ఉబికి వస్తుండటం, మీటర్ల కొద్దీ బురద మేటలు కట్టేయడం ఇలా ఒకటి కాదు ఎన్నో అడ్డంకులు. అయితే.. మొత్తానికి చాలా ప్రయత్నాల తర్వాత 16వ రోజున కేరళ నుంచి రప్పించిన నీలో నైస్ జాతి డాగ్స్ సహకారంతో ఎట్టకేలకు ఆ బురద కూపంలో మనిషి ఆనవాళ్లను గుర్తించి.. ఓ మనిషి మృతదేహాన్ని వెలికి తీయగలిగాయి. అది టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాంగా గుర్తించారు. ఇంకా ఏడు లభ్యమవ్వాల్సి ఉంది. దానికోసం రోబోలను రంగంలోకి దించనున్నారు.
నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లా, దోమలపెంట (Domalapenta) సమీపంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు జరుగుతుండగా ఫిభ్రవరి 22న ప్రమాదం జరిగిందని తెలిసింది. సొరంగం పై కప్పు కూలడంతో ఇంతటి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగింది సొరంగంలోని 14వ కిలోమీటరు వద్ద. ప్రస్తుతం ఎన్జీఆర్ఐ(NGRI), సిస్మాలజి, జియాలజీ బృందాలతో అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజులకు సొరంగం లోపలి నుంచి వ్యర్థాలను మోసుకొచ్చే కన్వేయర్ బెల్టు చెడిపోయింది. ఇటీవల పునరుద్ధరించినప్పటికీ అది మళ్లీ మొరాయించినట్లు తెలిసింది. తాజాగా లోక్ ట్రైన్(Loco Train) ట్రాక్ ను కూడా పునురుద్ధరించారు. దాంతో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ లోకో ట్రైన్.. 13.20 కిలోమీటర్ల వరకు ప్రస్తుతానికి వెళ్లగలుగుతోందని వినికిడి. ఇక, ఇవాల్టీ నుంచి రోబోలు రంగ ప్రవేశం చేయనున్నాయి. దీంతో మృతదేహాల గుర్తింపు ఈజీ అవుతుందని, రెస్క్యూని వేగంగా కొనసాగించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Population Crisis in Southern States: సౌత్ లో సంక్షోభం… ఫ్యామిలీ ప్లానింగ్ పాటించి ఇంత పెద్ద తప్పు చేశామా?
ప్రాజెక్టు పనుల్లో భాగంగా సొరంగంలో అసువులు బాసిన ఆ ఏడుగురి మృతదేహాలను (Seven dead bodies)వెలికి తీయడానికి… మొత్తం 150 మంది కార్మికులు నాలుగు బృందాలుగా ఎడతెరిపి లేకుండా శ్రమిస్తున్నారు. ఆదివారం గురుప్రీత్ సింగ్(Gurupreet singh) డెడ్ బాడీ లభించన ప్రదేశాన్ని డీ2 పాయింట్ గా గుర్తించారు. అయితే అక్కడే మరికొందరి ఆచూకీ దొరకవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్కడే తవ్వకాలు జరుపుతున్నారు. టన్నెల్ పైకప్పు కూలడం వల్ల ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో నిండిపోయింది. 4 నుంచి 9 మీటర్ల మేర మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. దానికి తోడు
టన్నెల్ లో నిమిషానికి దాదాపు 5 వేల లీటర్ల నీరు ఊరుతోందని అధికారుల చెబుతున్నారు. ఆ నీటిని తోడటానికి ప్రతి రెండున్నర కిలోమీటర్లకు ఒక పంపింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదిలావుంటే… టన్నెల్ దగ్గర మంత్రి ఉత్తమ్ కుమార్.. సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. అక్కడ పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చిస్తారు.