jyothika
ఎంటర్‌టైన్మెంట్

Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక

Jyothika: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ ‘కంగువ’. 2024లో టాలీవుడ్‌లో రిలీజైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో బాబీ డియోల్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ మూవీకి శివ డైరెక్షన్ వహించాడు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సూర్య చరిత్రలో డిసాస్టర్ మూవీగా ఇది నిలిచింది. సుమారు రూ.350 కోట్లతో ఈ మూవీని రూపొందించారు. కేవలం రూ.100 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలను తెచ్చింది. అయితే అప్పట్లో జ్యోతిక ఈ చిత్రంపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తన భర్తపై పగ పట్టారని, కావాలని నెగటివ్ రివ్యూస్ ఇచ్చారని వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో జ్యోతిక కామెంట్స్ వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఈ సినిమా ప్రస్తావన రాగా జ్యోతిక ఎమోషన్ అయ్యింది.

నటి జ్యోతిక తనకంటూ ప్రత్యేకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దక్షిణాదిలో దాదాపు అందరూ స్టార్ హీరోస్ యాక్ట్ చేసింది. షాక్, ఠాగూర్, మాస్, చంద్రముఖి’ వంటి మూవీస్ జ్యోతికకు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘చంద్రముఖి’ సినిమాలో ఆమె అద్భుత నటనగానూ ఎన్నో ప్రసంశలు అందుకుంది. 2006లో హీరో సూర్యని జ్యోతిక పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత కొంత సినిమాలకు దూరంగా ఉంది. ఇక ఇటీవలే కుటుంబంతో సహా జ్యోతిక ముంబైకి షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ మూవీస్, వెబ్‌సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది.

తాజాగా ‘డబ్బా కార్టెల్‌’ అనే వెబ్‌‌సిరీస్‌‌లో జ్యోతిక కీలక రోల్ పోషిస్తుంది. గతనెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ వెబ్‌‌సిరీస్‌‌లో జ్యోతిక ధూమపానం చేసే సీన్స్‌లో యాక్ట్ చేసి అందరినీ ఆకట్టుకుంటుంది. హితేష్ భాటియా డైరెక్షన్ వహించిన ఈ వెబ్‌‌సిరీస్‌‌లో ముంబైలో ఫుడ్ డెలివరీ ట్రక్కుల ద్వారా జరిగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ సాగుతోంది. ఇందులో కోలమావు కోకిల ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ వెబ్‌‌సిరీస్‌‌లో మలయాళ నటి నిమిషా సజయన్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్‌కు హితేష్ భాటియా డైరెక్షన్ వహించారు. ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది.

Also Read: టాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. ‘ఓజీ’ వస్తున్నాడు

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తన భర్త సూర్యని చూస్తే గర్వంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హీరోలు ఎవరు చేయని విధంగా కొత్తకొత్తగా ట్రై చేస్తూ ముందుకు వెళ్తున్నాడని పేర్కొంది. ‘కంగువ’ కూడా అద్భుతమైన ప్రయోగంగా రుపొంచించారని తెలిపింది. మొదటి అరగంట మాత్రమే బాలేదని, సినిమాను బ్యాడ్ రివ్యూస్ తో తొక్కేశారని ఏమోషనల్ అయ్యారు. అయితే మూవీలో బాగున్నా సీన్స్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించించింది. అయితే ఈ మూవీ రిలీజైన కొన్ని చెత్త సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారని, అవి కమర్షియల్‌గా కూడా మంచి హిట్స్ అయ్యాయని తెలిపింది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్