Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు పవన్. ఆ తర్వాత గోకులంలో సీత, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సూపర్ హిట్స్ మూవీలతో పవన్‌కు ఫ్యాన్స్ ఫాలోవింగ్ పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన జానీ సినిమా హట్టర్ ప్లాప్ మూటకట్టుకుంది. ఈ చిత్రానికి పవన్ స్టోరీ, డైరెక్షన్ అండ్ హీరోగా నటించడం విశేషం. ఇక మూవీలో పవన్‌కు జంటగా రేణూ దేశాయ్ నటించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక ఆ తరవాత పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయారు. అయితే ఈ కపుల్‌కి ఒక కుమారుడు, కుమార్తె ఉంది.
ఇక ఆ తర్వాత గుడుంబా శంకర్, బంగారం, జల్సా, పులి, తీన్‌మార్, పంజా వంటి చిత్రాల్లో పవన్ నటించాడు. తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో పవన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రం భారీగా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి వంటి సినిమాలు పవన్ నటించాడు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ‘హరి హర వీర మల్లు’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీని ముందుగా ఈ ఏడాది 28న విడుదల చేయాలని అనుకున్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలను పోస్ట్‌పోన్ చేశారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. మే 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్.. ఏప్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ పదవి బాధ్యతలు చేపడుతున్నారు. దీంతో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్. దీంతో మూవీ షూటింగ్‌కు అటెండ్ కాలేకపోతున్నారు. దీంతో పలు సినిమాలు షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. ఇంకా చిత్రకరణ దశలోనే ఉన్నాయి. అందుకే ‘హరి హర వీర మల్లు’ తో పాటు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘OG’ కూడా విడుదలకు ఆలస్యం అవుతుంది.
Also Read: నాని దర్శకుడు.. పెద్ద స్కెచ్చే ఇది!.. కుర్ర దర్శకులు పోటీ పడతారేమో?
అయితే ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ చివరి దశలో ఉండగా.. దీన్ని పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారట. దీంతో మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘హరి హర వీర మల్లు’ విడుదలైన 5,6 నెలల్లోనే ‘OG’ కూడా థియేటర్స్‌లో రీలిజ్ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ డేట్స్ కూడా ఫిక్స్ చేశారట. త్వరలోనే చిత్ర షూటింగ్ మొదలు కానుంది. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.