Lift Accident: సిరిసిల్లో లిఫ్ట్ ప్రమాదం... పోలీస్ కమాండెంట్ మృతి
siricilla lift accident
Telangana News

Lift Accident: లిఫ్ట్ ప్రమాదం… పోలీస్ కమాండెంట్ మృతి

Lift Accident: సిరిసిల్లలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. లిఫ్ట్‌ వచ్చిందనుకుని గ్రిల్ తీసి లోపలికి అడుగుపెట్టడంతో ప్రమాదవశాత్తు ఆయన పడిపోయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… 17వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం సిరిసిల్లలోని ఓ అపార్ట్మ్ంట్ లోని మూడో అంతస్తులో ఉన్న తన స్నేహితుణ్ని కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లిఫ్ట్ వచ్చిందునుకొని గ్రిల్ ఓపెన్ చేయడంతో ఆయన కింద గ్రౌండ్ ప్లోర్లో ఉన్న లిప్ట్ పై పడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే గంగారాం మృతిచెందారు. స్నేహితుడిని కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గంగారాం స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సిద్దులంగా తెలుస్తోంది.

ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కొన్ని రోజుల ముందే హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుని ఓ బాలుడు మృతిచెందని విషయం తెలిసిందే. చాలా చోట్ల పాత భవనాల్లో గ్రిల్ టైప్ ఉన్న లిఫ్ట్ లు ఉంటుంటాయి. వాటితో చాలా ప్రమాదం.మనం హడావుడిలో ఉండి… అందులో గనక సాంకేతిక లోపం ఉన్నట్లయితే… లిఫ్ట్ రాకపోయిన అది ఓపెన్ అవుతుంటుంది. సాధారణంగా అలాంటి సందర్బల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరగుతుంటాయి. కాబట్టి లిఫ్ట్ లు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క