priyadarsi
ఎంటర్‌టైన్మెంట్

Star Comedian: అతని బయోపిక్ చేయాలని ఉందంటోన్న స్టార్ కమెడియన్!

Star Comedian: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’-స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఇందులో నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి రామ్ జగదీష్ డైరెక్షన్ వహించిన ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. ట్రైలర్, అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్ భాగంగా యాక్టర్ ప్రియదర్శి మీడియాతో మాట్లాడారు.

2022లో తాను, రామ జగదీష్ వేరే సినిమా చేస్తున్న సమయంలో మండుటెండలో ఒక చెట్టు కింద కూర్చుని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామని, ఈసారి కచ్చితంగా ఒక మంచి సినిమా చేయాలి అనుకుంటూ ఉన్న టైంలోనే రామ్ జగదీష్ ఒక ఐడియా ఉందని చెప్పారని అన్నారు. ఇక స్టోరీ రాసుకొని రమ్మని చెప్పగా.. ఒక 6 నెలలకి కథ మొత్తం రాసుకుని తీసుకోవచ్చాడని తెలిపాడు. ఇలాంటి కథలు ఇప్పుడు ఎవరు చేస్తారని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇది గనుక హిట్ అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోయి సినిమా అవుతుందని గట్టి నమ్మకం కలిగిందని చెప్పాడు. మళ్లీ తర్వాత సమ్మర్‌కి నానితో గోవాలో ‘హాయ్ నాన్న’ మూవీ చేస్తున్న సమయంలో ఈ స్టోరీ గురించి చెప్పినప్పుడు నాని ఈ కథ వింటానని చెప్పారన్నారు. తరువాత నాని కథ విని, ఈ కథ మనం చేస్తున్నామని చెప్పారుని.. అలా స్టార్ట్ అయింది ఈ స్టోరీ అని వెల్లడించారు. ఈ కథ చెప్పినప్పుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందని రామ జగదీష్ అనుకున్నా డని, కానీ తాను ఈ క్యారెక్టర్ చేస్తానని పట్టుపడంతో సరే అని ఒప్పుకొని నాని దగ్గరికి వెళ్లి అదే విషయం చెప్పాడని తెలిపాడు. ఇలాంటి కథలు బాలీవుడ్‌లో ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పారు. నాని ‘ఈ సినిమా చూడండి.. నచ్చకపోతే నా సినిమా కూడా చూడటం మానేయండి’ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రియదర్శి మాట్లాడుతూ.. ఆయనకు కథ మీద ఉన్న నమ్మకమని. నాని ఎంచుకునే కథలు కూడా అలానే ఉంటాయన్నారు.

Also Read: హీరోయిన్ సౌందర్యను చంపించాడంటూ మోహన్ బాబుపై ఫిర్యాదు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు

star comedian

ఇక ఒక బయోపిక్ చేయాలని ఉందని ప్రియదర్శి వెల్లడించాడు. శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేఐ వరప్రసాద్ బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఉందని అన్నారు. కోర్టు సినిమాకి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ వస్తే తాను కమర్షియల్ హీరో అని అనుకుంటానని తెలిపాడు. మంచి సినిమాకి పైసలు వస్తే అది కమర్షియల్ హిట్ అని పేర్కొన్నాడు. తన లాంటి నటులు మంచి స్టోరీలు చేస్తేనే థియేటర్‌లకి జనాలు వస్తారు.. లేదంటే రారని వెల్లడించారు. ఇక ప్రశాంతి, దీప్తి తమకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని తెలిపారు. సెట్స్‌లో తమతో పాటు ఉండేవారని, నాని మాత్రం అప్పుడప్పుడు రషెస్ చూసి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తూ ఉండే వారని చెప్పుకొచ్చాడు.

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?