nan-srikanth
ఎంటర్‌టైన్మెంట్

Srikanth Odela: నాని దర్శకుడు.. పెద్ద స్కెచ్చే ఇది!.. కుర్ర దర్శకులు పోటీ పడతారేమో?

Srikanth Odela: సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోగానే రాణిస్తూ.. చిత్రాలు నిర్మిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది డైరెక్టర్లు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. ఓ వైపు డైరెక్షన్ అంటూ బిజీగా ఉంటూనే.. మరోవైపు మూవీస్ కూడా నిర్మించుకుంటున్నారు. సొంత చిత్రాలతో పాటు వేరే ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. సంపత్ నంది, అనిల్ రావిపూడి.. సుకుమార్ వద్ద అయితే సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానరే ఉంది. ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్ మూవీ దసరాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా నిర్మాత మారాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ది ప్యారడైజ్ అనే సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నాడు. ఒకే ఒక్క పదంతో ప్యారడైజ్ పై అందరూ మాట్లాడుకునేలా చేశాడు. నాని గెటప్, మూవీ సెటప్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది.

ఇక హీరోగా నాని తనకు నచ్చిన ఇతర చిన్న స్టోరీస్ నిర్మించేందుకు వాల్ పోస్టర్ అని పెట్టుకుని నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సైతం ప్రస్తుతం తన వద్ద ఉన్న మరో స్టోరీతో ‘గులాబి’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ.. ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ‘Al అమీనా జరియా రుక్సానా’ ట్యాగ్‌లైన్. చాయ్ బిస్కెట్ అనురాగ్ శరత్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీకి చేతన్ బండి డైరెక్షన్ వహిస్తున్నాడు. ఇంకా ఇలాంటి బయటి ప్రపంచానికి పరిచయం చేయాలని.. నాని అభినందిస్తూ ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. అయితే దీనికి ‘అంతా నీ వల్లే.. నువ్వు ఉన్నావ్ అనే ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నా.. నీ అడుగు జాడల్లో నడుస్తున్నా అన్నా’ అంటూ ఓదెల రిప్లై కూడా ఇచ్చాడు.

ఇక ఈ పోస్టర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి కంచె వెంట నడుస్తూ, ఎర్ర గులాబీలు ఆకాశంలో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్, ఆకర్షణీయమైన పోస్టర్ కలయిక ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ‘గులాబీ’ అనేది 2009లో గోదావరిఖని అనే బొగ్గు పట్టణం నేపథ్యంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్న స్టోరీ. ఈ ప్రేమ గాథ ఒక అబ్బాయిని గాఢంగా లవ్ చేసే అమ్మాయి యొక్క లోతైన భావోద్వేగాలను చిత్రీకరిస్తుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.త్వరలో రెగ్యులర్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Srikanth Odela

Also Read: హీరోయిన్ సౌందర్యను చంపించాడంటూ మోహన్ బాబుపై ఫిర్యాదు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు

ఇక ఒక్క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. మరి ప్రొడ్యూసర్ గా కూడా రాణించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు డైరెక్టర్లు చిత్ర నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు. డైరెక్టర్లు మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల కూడా యువ దర్శకులకు పోటీగా మూవీస్ చేస్తూ రాణిస్తాడని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?