Sri Chaitanya IT Rides: శ్రీచైతన్య కాలేజీల్లో (Sri Chaitanya College) రెండో రోజు ఐటీ సోదాలు (IT searches) కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ కాలేజీలున్నాయి. ప్రస్తుతం ఏపీ(AP), తెలంగాణ(Telangana)తో పాటు 10 ప్రాంతాల్లో దాడులు(Raids) జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం(Seized) చేసుకున్నట్లు తెలుస్తోంది.
అడ్మిషన్లు(Admission fee), ట్యూషన్ ఫీజు(tuition fee)ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగానే అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు అన్నిట్లో ముందుండాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ కళాశాలలో చదివిస్తుంటారు. టెన్త్, ఇంటర్ తో పాటు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో కోచింగ్ ఇప్పిస్తుంటారు. అయితే దీన్నే అవకాశంగా భావించిన శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఐటీ అధికారులు ఒకేసారి పలు నగరాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. కాగా, 2020లోనూ శ్రీచైతన్య కాలేజీలపై ఇదేవిధంగా ఐటీ సోదాలు జరిగాయి. అప్పుడు రూ.11 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఈ విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లో ఆదాయపు పన్ను అధికారులు సోమవారం నుంచి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్(Madhapur) లోని శ్రీ చైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్స్(Head Quarter) లోనూ సోదాలు చేపట్టారు. అక్కడ పెద్ద మెుత్తంలో అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల్లో శ్రీ చైతన్యకు విద్యాసంస్థలకు కాలేజీలు ఉన్నాయి. మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా అవన్నీ పనిచేస్తున్నాయి. అయితే స్టూడెంట్స్ నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా వాటిని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్(Software) నే తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ లావాదేవీల(Alleged Transactions)కు ఒక సాఫ్ట్ వేర్.. ట్యాక్స్(Tax) చెల్లింపులకు మరో సాఫ్ట్ వేర్ ను శ్రీచైతన్య ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య కాలేజీలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఐటీ రైడ్ లకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.