suicide
తెలంగాణ

Family suicide: దారుణం… కొడుక్కి విషమిచ్చి, కూతురుకి ఉరి వేసి, దంపతుల ఆత్మహత్య

Family suicide: హైదరాబాద్‌ హబ్సిగూడలో దారుణం చోటుచేసుకుంది. కన్న బిడ్డలిద్దరిని ఒకిరిక విషమిచ్చి, మరొకరికి ఉరి వేసి చంపిన దంపతులు వాళ్లు కూడా సూసైడ్ చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం…కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డ్డి (44) కుటుంబం కొంతకాలంగా హబ్సిగూడ(Habsiguda) ఉంటున్నది. చంద్రశేఖర్ రెడ్డి(chandrasekhar Reddy)కి భార్యకవితతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి పేరు విశ్వాన్ రెడ్డి(10), అమ్మాయి పేరు శ్రీత రెడ్డి(15). చంద్రశేఖర్ ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేసేవారు. అయితే ఆరు నెలలుగా ఉద్యోగం మానేశారు. ఐదారు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దానికి తోడు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ కావడంతో…సోమవారం కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషమిచ్చి, కుమార్తె శ్రీతరెడ్డికి ఉరేసి చంపినట్టు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత దంపతులు ఇద్దరు సూసైడ్ చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు(OU Police)… అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ సూసైడ్ నోట్(Suicide note) ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ‘నా చావుకి ఎవరూ కారణం కాదు.. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కెరీర్‌లోనూ, శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను’ అని సూసైడ్‌ నోట్‌లో చంద్రశేఖర్‌రెడ్డి రాశారు.

Also Read: 

Mohan Babu: హీరోయిన్ సౌందర్యను చంపించాడంటూ మోహన్ బాబుపై ఫిర్యాదు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు

 

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు