Dil ruba
ఎంటర్‌టైన్మెంట్

Dil ruba: ‘దిల్ రూబా’లో సరికొత్త లవ్ స్టోరీ: డైరెక్టర్ విశ్వ కరుణ్

Dil ruba: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం  ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. థియేటర్స్‌లో సినిమాలు రెగ్యులర్‌గా చూస్తుండేవాడిని. అలాగే పుస్తకాలు చదవడం చాలా ఇంట్రెస్ట్. నేను తెరపై చూసిన స్టార్స్, సినిమాలు నన్ను ప్రభావితం చేశాయి. అలా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాను. స్నేహితుడి ద్వారా నలదమయంతి అనే మూవీకి రైటింగ్ సైడ్ వర్క్ చేశాను. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత విజయేంద్రప్రసాద్ రాసిన జాగ్వార్ మూవీకి వర్క్ చేశా. అలాగే దిల్ రాజు బ్యానర్‌లో రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఇలా జర్నీ సాగుతుండగా..ఓ రోజు కిరణ్ అబ్బవరంకి ఓ కథ చెప్పి కథ వరకు ఇచ్చేదామని వెళ్లాను. ఆయన కథ విని నచ్చలేదు గానీ నువ్వు కథ చెప్పిన విధానం బాగుంది. మరో మంచి సబ్జెక్ట్ ట్రై చేయి అన్నారు. అలా కొంతకాలం తర్వాత దిల్ రూబా కథను వినిపించా. కిరణ్ వెంటనే మనం ఈ మూవీ చేస్తున్నాం బ్రదర్ అని అన్నారు. అలా దిల్ రూబా మూవీ సెట్స్ మీదకు వెళ్లింది’ అని అన్నారు.

‘కిరణ్ అబ్బవరం దిల్ రూబా చిత్రానికి ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. దర్శకుడిగా నేనే అన్ని క్రాఫ్టులు చూసుకోవాల్సిన టెన్షన్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సమయం తీసుకో బ్రదర్.. బాగా మూవీ చేయి అని ఎంకరేజ్ చేశారు. కిరణ్ దర్శకత్వంలో ఇన్వాల్వ్ అవుతారనేది తప్పు. నా వర్క్‌లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. అయితే కెరీర్‌లో ఎదురుదెబ్బలు తిన్న ఎవరికైనా మంచి మూవీ చేయాలనే భయం ఉంటుంది. అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం. కిరణ్ చేసేది అదే. క మూవీ సక్సెస్ తర్వాత మరింత గ్రాండియర్‌గా దిల్‌రూబాను తీసుకురావాలని అనుకున్నాం. ఆ క్రమంలో కొన్నిమార్పులు చేశాం గానీ మూలకథలో ఎలాంటి ఛేంజెస్ చేయలేదు’ అని తెలిపాడు.

Also Read: కళ్యాణ్ రామ్ సినిమాకు ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు

‘వెస్ట్రన్ కల్చర్ నుంచి మనం సారీ, థ్యాంక్స్ మాటలు చాలా త్వరగా అలవాటు చేసుకున్నాం. తెలుగులో క్షమించమని అడగలేము గానీ సారీ మాత్రం ఈజీగా చెప్పేస్తాం. తన తప్పు లేనప్పుడు సారీ ఎందుకు చెప్పాలనుకుంటాడు హీరో. ఇలాంటి వ్యక్తిత్వం వల్ల తనతో ఉన్నవారికి ఇబ్బంది ఉండొచ్చు. దిల్ రూబాలో కిరణ్ చేసిన సిద్ధు క్యారెక్టర్ కూడా తన వ్యక్తిత్వం విషయంలో కాంప్రమైజ్ కాడు. క్యారెక్టర్‌ను నమ్ముకుంటాడు. దాని వల్ల అతని లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..