Chhaava:ఛత్రపతి శంభాజీ మహారాజ్ అజేయమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం హిందీ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత ఈ పవర్ ఫుల్ కథను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ మార్చి 7న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.
ఈ సందర్బంగా నిర్మాత బన్నివాస్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని తెలుగులో ఇంత గర్వంగా విడుదల చేయగలిగాను అంటే దానికి కారణం దినేష్. ఆయన మమ్మల్ని బలంగా నమ్మి ఇచ్చారు. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా హిట్ చేస్తారు. అదే నమ్మకంతో ఆయన సినిమా ఇచ్చారు. దినేష్‌కి థాంక్యూ. మాడ్డాక్ ఫిల్మ్స్ టీం అందరికీ థాంక్ యు. సినిమాలో వినీత్ క్యారెక్టర్‌కి చాలా కనెక్ట్ అయ్యాను. క్లైమాక్స్‌లో కన్నీళ్ళు వచ్చాయి. ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత ఈజీ కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ఇంత గొప్ప సినిమాగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్‌కి ధన్యవాదాలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఆ రోజు శంభాజీ మహారాజ్ లాంటి మహావీరులు త్యాగమే ఫలితమే. ఒక మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలనే తపనతో ఈ సినిమా చేశాం. మా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇది మంచి సినిమా. పిల్లలకు చూపించాల్సిన సినిమా. ఈ జనరేషన్ లో ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే తల్లిదండ్రులు ఇలాంటి సినిమాలను పిల్లలు చూపించాలని కోరుకుంటున్నాను. ఛావా కేవలం సినిమా మాత్రమే కాదు.. గ్రేట్ ఎమోషన్. రెహ్మాన్‌కి కృతజ్ఞతలు. నాలుగు రోజుల్లో ఆయన పాటలని పూర్తి చేశారు. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనకి తెలుసు. సినిమాపై ప్రేమతో మాకు చేసిచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుంది. తప్పకుండా ఈ సినిమా మీ పిల్లలని తీసుకెళ్ళండి. గొప్ప ఎమోషన్ తో బయటికి వస్తారు’ అని అన్నారు.
Also Read: కళ్యాణ్ రామ్ సినిమాకు ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు
వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులకు సినిమాపై ఉన్న ప్రేమ చాలా ప్రత్యేకం. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల్ని స్టార్స్‌ని సపోర్ట్ చేస్తున్న విధానం అద్భుతం. ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేసిన గీత ఆర్ట్స్‌కి, బన్నీవాస్‌కి థాంక్ యూ. ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీకి థాంక్. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.