Singer Kalpana
ఎంటర్‌టైన్మెంట్

Singer Kalpana: మహిళా కమిషన్‌కు కల్పన ఫిర్యాదు.. వారిపై చర్యలు తీసుకోండి!

Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాలో తనపై పెడుతున్న అసత్య పోస్టులు ఆపాలని మహిళా కమిషన్‌ను కోరింది. నిజానిజాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్‌ అంటూ పలు రకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూసైడ్ అటెంప్ట్‌పై కల్పన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కల్పన ఓ వీడియో విడుదల కూడా చేసింది. ఈ సందర్బంగా కల్పన మాట్లాడుతూ.. తాను అసలు సూసైడ్ అటెంప్ట్ చేయలేదని స్పష్టం చేసింది. నిద్ర మాత్రల డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు స్పష్టం చేసింది. ఇన్‌సోమ్నియాతో ఇబ్బంది పడుతున్న తాను టాబ్లెట్స్ వాడుతున్నానని, ఈ క్రమంలోనే డోస్ ఎక్కువ కావడం వల్ల స్పృహ తప్పి పడిపోయానని తెలిపింది. తమకు కుటుంబ గొడవలు ఏమి లేదని స్పష్టతనిచ్చింది. తాను ఇప్పడు లా కోర్సు కూడా చేస్తున్నానని వెల్లడించింది. తన హస్బెండ్ ప్రోత్సహిస్తాడని,ఆనందంగా ఉంటున్నామని తెలిపింద్. ఇటీవలే మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ కూడా మొదలుపెట్టామని పేర్కొంది. అయితే ఇలా తప్పుడు ప్రచారం చేయడం బాధ కలిగించిందని పేర్కొంది. త్వరలో మంచి మంచి పాటలు పాడుతూ అందరిని సంతోష పెడతానని చెప్పుకొచ్చింది.

అయితే కల్పన ఆత్మహత్యాయత్నానికి భర్త ప్రసాద్, కూతురు కారణమని వార్తలు వచ్చాయి. కూతురు మాటవినకవడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకుందని, కల్పన నుంచి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని కూడా వార్తలు వినిపించాయి. పెద్దకూతురిని చదవుల కోసం హైదరాబాద్‌ రావాలని కల్పన కోరితే, తాను కేరళలోనే చదువుకుంటానని తల్లితో కూతురు చెప్పడంతో మనస్తాపంతో నిద్ర మాత్రలు వేసుకుందని పోలీసులకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. వీటన్నింటికి పులిస్టాప్ పెట్టెనందుకు కల్పన కుమార్తె దయ సైతం స్పందించింది. తన తల్లిది సూసైడ్ అటెంప్ట్ కాదని వెల్లడించింది. తన తల్లి గాయని మాత్రమే కాదని, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారని తెలిపింది. ఇన్‌సోమ్నియాతో ఇబ్బంది పడుతుండటంతో వైద్యుల సూచన మేరకే మాత్రలు వేసుకుంటుందని, ఈ క్రమంలోనే టాబ్లెట్స్ డోస్ ఎక్కువ కావడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తెలిపింది. తన తల్లి ఆత్మహత్యాయత్నంకు ఏమి పాల్పడలేదని పేర్కొంది. తమ కుటుంబం అంత ఆనందంగా ఉందని, తన అమ్మనాన్న మధ్య ఎలాంటి విబేధాలు లేవని, సంతోషంగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కూడా సూచించిన విషయం తెలిసిందే.

Also Read: కళ్యాణ్ రామ్ సినిమాకు ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు

ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్‌కు కల్పన ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను కోరింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హామీ ఇచ్చింది. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలు చేస్తే ట్రోలర్స్ పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?