Arjun Son Of Vyjayanthi Movie Still
ఎంటర్‌టైన్మెంట్

NKR21: కళ్యాణ్ రామ్ సినిమాకు ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు

NKR21: నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం #NKR21కు టైటిల్ ఫిక్స్ చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత లేడీ సూపర్ స్టార్ అలియాస్ రాములమ్మ విజయశాంతి (Vijayashanti) IPS ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి అంగీకరించిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్‌గా గత వారం రోజుల నుండి ఓ టైటిల్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడదే టైటిల్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

Also Read- Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈ సినిమాకు ‘అర్జున్ S/O వైజయంతి’ (Arjun S/O Vyjayanthi) అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఈ నేమ్‌కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కువగా సన్నాఫ్ అని రాసిన తర్వాత తండ్రి పేరు మాత్రమే రాస్తారు. కానీ ఫస్ట్ టైమ్ ఈ సినిమా విషయంలో తల్లి పేరు రాసి, టైటిల్‌తోనే వైవిధ్యతను చాటారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ టైటిల్‌కు తగినట్లుగా పవర్ ఫుల్ ఇంపాక్ట్‌ని కలగజేస్తుంది. ఈ పోస్టర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలని ఇంటెన్స్ డైనమిక్‌గా తెలియజేస్తుంది. మండుతున్న జ్వాలల మధ్య దృఢ సంకల్పంతో ఇద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ని విజయశాంతి గైడ్ చేస్తున్నట్లుగా చూపిస్తూ.. టైటిల్‌కి ఈ ఫస్ట్ లుక్‌తోనే జస్టిఫికేషన్ ఇచ్చేశారు. చుట్టూ ఫ్యాక్టరీ లాంటి వాతావరణం, చెల్లాచెదురుగా ఉన్న ఇనుప గొలుసులు సినిమాపై ఇంటెన్సిటీని పెంచుతున్నాయి.

Arjun Son Of Vyjayanthi Movie Still
Arjun Son Of Vyjayanthi Movie Still

మ్యాసీవ్ హ్యాండ్ కప్స్ ఈ పాత్రలను కలుపుతూ, వారి బాండింగ్‌ని ప్రజెంట్ చేశాయి. కళ్యాణ్ రామ్ పవర్, కళ్ళలో ఇంటెన్సిటీతో కనిపిస్తుంటే, విజయశాంతి ఖాకీ దుస్తులలో ఆజ్ఞాపిస్తున్నట్లుగా అనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఫెరోషియస్ వైబ్‌ను మరింత పెంచుతుంది. టైటిల్‌లో ‘S’, ‘O’ అనే అక్షరాలను గొలుసుతో అనుసంధానించిన విధానం, థీమ్‌కు సింబాలిక్‌గా ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్, శ్రీకాంత్ విస్సా స్ర్కీన్‌ప్లే బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, పాటల చిత్రీకరణకు రెడీ అవుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:
Chiranjeevi: మెగాస్టార్ నుంచి మహిళలకు విషెస్‌ వచ్చేశాయ్.. స్పెషల్ ఏమిటంటే?

Bandla Ganesh: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్