Sankranthiki Vasthunam Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Sankranthiki Vasthunam: మరో 300 కొట్టిన వెంకీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్

Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరో 300 కొట్టింది. అంతే, మరోసారి ఈ సినిమా వార్తలలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ 300 ఎక్కడ కొట్టిందని అనుకుంటున్నారా? ఇంకెక్కడ ఓటీటీలో. సంక్రాంతికి భారీ పోటీ మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ సినిమా రూ. 300 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి, అందరికీ షాకిచ్చింది. కారణం, విక్టరీ వెంకటేష్ కెరీర్ ఏమంత గొప్పగా సాగడం లేదు. స్టార్ హీరో అయినప్పటికీ వరసబెట్టి సినిమా అవకాశాలేం రావడం లేదు. పైగా అంతకు ముందు చేసిన ‘సైంధవ్’ సినిమా భారీ డిజాస్టర్. మరి అలాంటి హీరో నుంచి వస్తున్న సినిమాపై మొదట్లో అంతగా అంచనాలేం లేవు. కానీ, ప్రమోషన్స్‌లో టీమ్ ప్రదర్శించిన దూకుడు, విడుదలైన తర్వాత వచ్చిన టాక్‌తో ఒక్కసారిగా అంతా మారిపోయి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం మొదలైంది. రోజు రోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ, రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరి ఇప్పుడు కొట్టిన 300 ఏంటంటే..

Also Read- Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?

థియేటర్లలో కొన్ని చోట్ల ఇంకా ప్రదర్శితమవుతూనే ఉన్న ఈ సినిమాను రీసెంట్‌గానే జీ 5 ఓటీటీలోకి తెచ్చారు. ఈ ఓటీటీకి వచ్చే విషయంలోనూ కన్ఫ్యూజనే నెలకొంది. ఫైనల్‌గా, అన్నింటినీ క్లియర్ చేసుకుని, ఒకేసారి టెలివిజన్ ప్రీమియర్‌గానూ, అలాగే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. టెలివిజన్ ప్రీమియర్ సంగతి ఏమైందో తెలియదు కానీ, ఓటీటీలో మాత్రం మరోసారి ఈ సినిమా సునామీలా దూసుకెళుతోంది. థియేటర్స్‌లో చూశారు కదా.. ఇంక ఓటీటీలో ఎవరు చూస్తారులే అని అంతా అనుకున్నారు కానీ, ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ ఈ సినిమా అతి తక్కువ టైమ్‌లో 300 కొట్టేసింది. అర్థం కాలేదు కదా.. అసలు మ్యాటర్‌లోకి వస్తే..

ఓటీటీలో విడుదలైన 10 గంటల్లోనే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ రాబట్టి, సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం అతి తక్కువ టైమ్‌లో 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను బీట్ చేసి మరో రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు గురించి చెబుతూ.. సచిన్ బ్యాటింగ్‌తో కూడిన ఓ సరదా వీడియోను, ఓ ఐకానిక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా రీసెంట్‌గా 90 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ పోస్టర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే సినిమాకు చెందిన ‘గోదారి గట్టు మీద’ సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు కొడుతూ ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 200 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టి, ఇంకా చార్ట్ బస్టర్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతుండటం విశేషం. మొత్తంగా అయితే, వెంకీ కెరీర్‌లో మళ్లీ ఈ వైభోగం వస్తుందో, రాదో తెలియదు కానీ, ఈ సినిమా అన్ని రకాలుగా ఆయనకు సంతృప్తిని ఇచ్చిందన్నది మాత్రం వాస్తవం. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి:
Chiranjeevi: మెగాస్టార్ నుంచి మహిళలకు విషెస్‌ వచ్చేశాయ్.. స్పెషల్ ఏమిటంటే?

Bandla Ganesh: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!