Tuk Tuk Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

Tuk Tuk: ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారి.. ఏంటో తెలుసా?

Tuk Tuk Song: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమాకు పోటీ పడుతుంది. కథల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానంలోనూ హాలీవుడ్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తుందంటే అతిశయోక్తి కానేకాదేమో. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు కొత్తదనం ఏదైనా ఉంటేనే థియేటర్లకు వస్తున్నారని గమనించిన మేకర్స్, వారిని మెప్పించేందుకు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగంతోనే వస్తుంది ‘టుక్‌ టుక్‌’ చిత్ర టీమ్‌. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఒక సాంగ్ మొత్తాన్ని ఇలా చిత్రీకరించడం ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే తొలిసారి అని చెప్పుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?

‘ఏలా అల తీపికోరే పూలతోట’ అంటూ సాగే ‘టుక్ టుక్’ చిత్రంలోని పాటను, విజువల్స్‌ను ఏఐ టెక్నాలజీతో స్టన్నింగ్‌గా, ఎంతో బ్యూటీఫుల్‌గా జనరేట్‌ చేశారు. దర్శకుడు సుప్రీత్ కృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీత దర్శకుడు సంతు ఓంకార్‌ స్వరాలు అందించారు. ఏఐ ఈ పాటను బ్యూటీఫుల్‌గా పిక్చరైజ్‌ చేసింది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి సి. సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్‌వైజి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా థియేటర్స్‌లో ఆడియన్స్‌ ఈ పాటను ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని తొలిసారిగా మా సినిమాకు వాడటం గర్వంగా ఉంది. సినిమా కూడా ఓ న్యూ కాన్పెప్ట్‌లో ఉంటుంది. ఫాంటసీతో పాటు కొన్ని మ్యాజికల్‌ ఎలిమెంట్స్‌ ఇందులో ఉంటాయి. అవి ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి, ఆ సర్‌ప్రైజ్‌లను ఎంజాయ్ చేయాలని కోరుతున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి:
Chiranjeevi: మెగాస్టార్ నుంచి మహిళలకు విషెస్‌ వచ్చేశాయ్.. స్పెషల్ ఏమిటంటే?

Bandla Ganesh: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు