All Party Meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో ప్రజాభవన్ లో ఇవాళ(శనివారం) ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు(MPs) హాజరుకావలసిందిగా భట్టి కోరారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లతో పాటు అందరు ఎంపీలకు స్వయంగా ఫోన్ చేసి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. అయితే ఎంపీల సమావేశానికి హాజరుకాకూడదని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. భట్టి పంపిన ఆహ్వానం ఆలస్యంగా అందిందని.. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా అఖిల పక్ష సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి లేఖ…
‘‘ఆహ్వానం ఆలస్యంగా అందింది. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదు. పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం.’’ అని భట్టికి రాసిన లేఖలో తెలిపారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలను గనక నిర్వహిస్తే కాస్త ముందుగా తెలియాజేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇక, రాష్ట్ర అభివృద్ధికి మోడీ(Modi) ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఇకముందూ కూడా చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తూనే ఉంటుందని రాసుకొచ్చారు.
కాగా, మరికాసేపట్లో ప్రజాభవన్‌లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యలను క్లియర్ చేసుకోవడమే ఎజెండాగా ప్రభుత్వం ఈ మీటింగ్ నిర్వహిస్తోంది.ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మాములుగా ఆల్ పార్టీ మీటింగ్ లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎందుకంటే రాజకీయ వైరం ఉన్న వాళ్లు ఒక వేదికపై కలుసుకొని కలిసి కట్టుగా చర్చించడమనేది అంతా సులువైన విషయం కాదు. కానీ .. ఇవాళ కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేసింది. తీరా దానికి బీజేపీ డుమ్మా కొట్టింది.
Also Read:
Telangana BJP: రద్దైన ‘బండి’ ర్యాలీ… బీజేపీలో క్రెడిట్ వార్ నడుస్తొందా?
PM Modi Womens Day: ఉమెన్స్ డే రోజున ప్రధాని సంచలన నిర్ణయం.. మహిళలకే బాధ్యతలు!