seed-scam in Mulugu
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Seed Scam: ఆర్గనైజర్లు ఎస్కేప్… ‘ఏజెన్సీల్లో.. సీడ్ బాంబ్’ కథనానికి విశేష స్పందన

‘స్వేచ్ఛ’ కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం
పరారీలో మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు
నివేదిక కోరిన ములుగు కలెక్టర్ దివాకర టీఎస్
పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్న అధికారులు
వ్యవసాయ క్షేత్రాల్లో ఏఈవో, ఈవోల సందర్శన
ఎకరానికి 65 వేల – 80 వేల వరకు నష్టం ?
నష్టపోయిన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో బాధిత రైతులు
15 వేల మంది రైతులకు తీవ్ర నష్టం.. పరిహారం కోసం డిమాండ్


ములుగు, స్వేచ్ఛ: శుక్రవారం ‘స్వేచ్ఛ’ డిజిటల్ న్యూస్(Swetcha e-Paper) తెలంగాణ ఎడిషన్‌(Telanganag Edition)లో ప్రచురితమైన ‘ఏజెన్సీల్లో.. సీడ్ బాంబ్’ కథనానికి విశేష స్పందన(Great Response) లభించింది. నాలుగు బహుళజాతి మొక్కజొన్న విత్తన కంపెనీల(Multinational Seed Companies)కు సంబంధించిన వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, గూడెప్పాడు, పరకాల మండలాల ఆర్గనైజర్లు ఎస్కేప్ అయ్యారు.

నష్టపోయిన రైతుల జాబితా తయారు చేయండి
ఏజెన్సీల్లో సీడ్ బాంబ్ కథనానికి ములుగు(Mulugu) జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్(Collector Diwakara TS) స్పందించారు. మొక్కజొన్న విత్తన(Corn Sedds) కంపెనీల వల్ల నష్టపోయిన రైతుల జాబితా తయారుచేసి నివేదిక అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను(Agriculture Officers) ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ ఆదేశాలతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఏవోలు ఏఈవోలు మొక్కజొన్న పంట క్షేత్రాలను సందర్శించారు. నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఒక్కో ఎకరానికి రైతులు నష్టపోయినట్టుగా గుర్తించారు. పరిహారాన్ని చెల్లించేందుకు వ్యవసాయ క్షేత్రాల్లోనే రైతుల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు.


2 మండలాల్లోనే 6వేల మంది
ఒక్క వెంకటాపురం, వాజేడు మండలాల్లోనే దాదాపు 6000 పైగా రైతులు బహుళజాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా తీవ్రంగా నష్టపోయినట్టు అధికారులు తెలుసుకున్నారు. ఇదే విషయమై జిల్లా వ్యవసాయ అధికారులతో డీఏవో సురేశ్ జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బహుళజాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా నష్టపోయిన రైతాంగం జాబితా తయారు చేసి, వారికి పరిహారం చెల్లించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పండిస్తున్న మొక్కజొన్న క్రాఫ్ జెనెటికల్లీ మోడిఫైడా, కాదా..? గుర్తించాలని అధికారులకు సూచించారు. నిరుపేద ఆదివాసీ రైతుల ద్వారా పండించే మొక్కజొన్న కేవలం సీడ్స్ కోసమే పండిస్తున్నారా..? లేదంటే వేరే ఇతర లాభాల కోసం రైతులను మభ్యపెట్టి పండిస్తున్నారా..? తేల్చాలని స్పష్టం చేశారు. ఆదివాసీ రైతులు సేద్యం చేస్తున్న మొక్కజొన్న విత్తనాలు బీటీ విత్తనాలా, లేదంటే సాదా విత్తనాలా? తేల్చాలని ఆదేశించినట్లు సమాచారం. ములుగు జిల్లాలో పలు మండలాల్లో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీలతో వ్యవసాయం చేసే రైతుల ఆర్థిక భారంపై జిల్లా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో పోలీసులు సైతం రైతులకు జరిగిన నష్ట నివారణపై సంబంధిత కంపెనీల ఆర్గనైజర్ల జాబితా తయారుచేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, పరకాల, తాడ్వాయి, గూడెప్పాడు మండలాల్లో దాదాపు 15 వేల ఎకరాల్లో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా ఆదివాసీ రైతులు సేద్యం చేస్తున్నట్లు తెలిసింది.

పదేళ్లుగా ప్రశ్నించేవారే లేరు..
గత నాలుగేళ్లుగా వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బహుళ జాతి మొక్కజొన్న విత్తనాల కంపెనీలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. శుక్రవారం ‘స్వేచ్ఛ’ డిజిటల్ న్యూస్‌లో ‘సీడ్ బాంబ్’ అనే శీర్షికతో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాన్ని కళ్లకు కట్టినట్టు వివరించడంతో రైతులకు మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. పదేళ్లుగా ఈ దందా సాగిస్తున్న మొక్కజొన్న బహుళ జాతి బీటీ విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తున్నా.. అడిగే వారే లేరు. ఆదివాసీలకు అండగా అధికారులను ప్రశ్నించినందుకు తనను ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జరుగుతున్న ఈ భారీ మోసాన్ని ప్రశ్నిస్తూ.. రైతులు పదిహేను రోజుల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు. దీనికి కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు అండగా నిలబడుతున్నాయి. ఈ బహుళజాతి విత్తన కంపెనీలను ఈ ప్రాంతానికి పరిచయం చేసి, కేవలం నాలుగు నెలల్లో పదుల సంఖ్యలో ఆర్గనైజర్లు రూ.కోట్లలో పోగేసుకుంటున్నారు.
– కొర్స నరసింహమూర్తి, ఆదివాసీ నవనిర్మాణ సేన  అధ్యక్షుడు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..