Jyothika: సీనియర్ నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకంటూ ప్రత్యేకమైన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. సౌత్ ఇండియాలో దాదాపు అందరూ స్టార్స్‌తో జ్యోతిక నటించింది. షాక్, ఠాగూర్, మాస్, చంద్రముఖి’ వంటి చిత్రాలు జ్యోతికకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘చంద్రముఖి’ సినిమా అనగానే జ్యోతిక పేరు గుర్తు వచ్చేలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఈ చిత్రంలో అద్భుత నటనతో ఎన్నో ప్రసంశలు అందుకుంది. 2006లో తమిళ స్టార్ హీరో సూర్యని వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత మూవీస్‌కి కొంత బ్రేక్ ఇచ్చింది. అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఇక ఇటీవలే ఫామిలీ సహా జ్యోతిక ముంబైకి మకాం మార్చింది. బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.
తాజాగా ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్‌సిరీస్‌లో జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జ్యోతిక ధూమపానం చేసే సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబైలో ఫుడ్ డెలివరీ ట్రక్కుల ద్వారా జరిగే డ్రగ్స్ అక్రమ రవాణా నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్ సాగుతోంది. ఈ సిరీస్ కోలమావు కోకిల ఆధారంగా చేసుకుని చిత్రీకరించారు. ఇందులోమలయాళ నటి నిమిషా సజయన్ కూడా ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్‌కు హితేష్ భాటియా డైరెక్షన్ వహించారు. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ సిరీస్‌లోని 80% మహిళలే నటించారని చెప్పింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మూవీస్‌లో హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. తాజాగా మార్పులు వస్తున్నాయని తెలిపింది. దక్షిణాది చిత్రాల్లో మేల్ రోల్స్‌కు బలమైన రీతిలో రాస్తారు. కానీ ఫిమేల్ రోల్స్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వరని తెలిపింది. హీరోయిన్స్ డ్యాన్స్ చేయడానికి, హీరోలను ప్రశంసించడానికి అలవాటు పడ్డారు. ఇది ఇప్పటికే కంటిన్యూ అవుతోందని చెప్పింది. ఇలాంటి మూవీస్ తాను కూడా చేశానని.. నటించానని చెప్పుకొచ్చింది. అయితే, తాను మరో మార్గంలో ప్రయాణించాలని ఇప్పుడు అనుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం జ్యోతిక కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Also Read: సినీ ఇండస్ట్రీకి సమంత వచ్చి 15 ఏళ్లు పూర్తి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో మొదటి సినిమాఅక్షయ్ ఖన్నాతో నటించానని వెల్లడించింది. అయితే ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో తర్వాత ఆఫర్లు రాలేదని వెల్లడించింది. దీంతో తమిళ చిత్రాల వైపు మొగ్గుచూపడంతో తొలి చిత్రం తన భర్త సూర్యతో చేశానని, ఇక అప్పటి నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయని తెలిపింది. దక్షిణాది ఎన్నో సినిమాలు గుర్తింపు తీసుకొచ్చాయని.. ఒకవేళ బాలీవుడ్‌లో సెటిలై ఉంటే, ఇలాంటి మంచి పాత్రలు అన్ని చేయకపోయే దానినని చెప్పుకొచ్చింది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందని, ఇక్కడి ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం ఉందని జ్యోతిక చెప్పుకొచ్చింది.