rajalingam
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Rajalingam Murder: రాజలింగం హత్య కేసు… హరిబాబును కాపాడుతున్నదెవరు?

తప్పించుకుంటున్నాడా? తప్పిస్తున్నారా?
పోలీసులు కావాలనే అరెస్ట్ చేయడం లేదా?
14 రోజులుగా పరారీలోనే బీఆర్ఎస్ నేత!
రాజలింగమూర్తి హత్యకేసులో ఏ8గా హరిబాబు
భూపాలపల్లి పీఎస్‌లో 10మందిపై కేసు
ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల తీరుపై కుటుంబసభ్యుల అనుమానాలు


వరంగల్, స్వేచ్ఛ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి(Rajalingamurthy) హత్య కేసు విచారణపై అనేక అనుమానాలు(suspicious) వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఏ8(A-8)గా ఉన్న బీఆర్ఎస్ నేత హరిబాబు(BRS Leader Haribabu)ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య కేసు విచారణపై మొదటి నుంచి రాజలింగమూర్తి కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఖతం చేయండి.. నేను చూసుకుంటా’ అంటూ ఈ కేసులో నిందితులకు హరిబాబు భరోసా ఇచ్చాడు. ఈ కేసులో ఏ8గా ఉన్న హరిబాబును పోలీసులు(Police) కావాలనే అరెస్ట్ చేయడం లేదన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. కీలక సూత్రదారి(Mastermind) అరెస్ట్ విషయంలో పోలీసులు ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు.

కావాలనే జాప్యం జరుగుతున్నదా?
అంతర్రాష్ట్ర దొంగలను, దేశవిదేశాల్లో తలదాచుకున్న కరడగట్టిన నేరస్తులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉంటారు. కాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్ట్ విషయంలో ఎందుకింత జాప్యం జరిగిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతున్నది. హరిబాబు నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారా? లేదంటే కావాలనే తప్పిస్తున్నారా? అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. హరిబాబుకు సహకరిస్తున్నది ఎవరు? ఆయనను కాపాడుతున్న అదృశ్యశక్తి ఏమిటి అన్న విషయంపై ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో చర్చ జరుగుతున్నది.


అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కటయ్యారా?
రాజలింగ మూర్తి భార్య సరళ ఆరోపిస్తున్నట్టుగా హత్యకేసులో కీలకమైన బడా నేతలను తప్పించి.. కేవలం పాత్రదారులను మాత్రమే అదుపులోకి తీసుకొని చేతులు దులుపుకుంటున్నారా? అన్న చర్చ కూడా సాగుతున్నది. అటవీ శాఖ భూములు, భూపాలపల్లిలోని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల రక్షణ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవినీతిపై రాజలింగమూర్తి కోర్టు్ల్లో కేసులు వేయడం.. సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తుండటంతో అందరికీ కంట్లో నలుసుగా మారాడు. రాజలింగమూర్తి కేసు నీరు గార్చేందుకు అధికార, విపక్ష పార్టీలు, పోలీస్ యంత్రాంగం ఏకమైందా? అన్న చర్చ సాగుతున్నది. అన్ని పార్టీల్లోనూ రాజలింగమూర్తికి శత్రువులు ఉన్నారు.. వివిధ శాఖల అధికారులతోనే ఆయనకు శత్రుత్వముంది. అందుకే కేసును తప్పు దోవ పట్టించి కొన్ని విషయాలకే పరిమితం చేయబోతున్నారా? అన్న చర్చ సాగుతున్నది.

కాపాడేందుకే అరెస్ట్ అపారా?
రాజలింగమూర్తి హత్య గత నెల 19న రాజలింగమూర్తి హత్య జరిగింది. నాలుగు రోజుల తరువాత ఫిబ్రవరి 23న పోలీసులు రేణికుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్ (బబ్లూ), మోరె కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసరి కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య అనే ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారం రోజుల తరువాత మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు హరిబాబును అరెస్ట్ చేయకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరో పక్క హరిబాబు మాత్రం ముందస్తూ బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చ సాగుతున్నది.

ముందస్తు బెయిల్ కోసం హరిబాబు పిటిషన్
-10కి విచారణను వాయిదా వేసిన హైకోర్టు.
రాష్ట్రంలో సంచలనం సంచలనం సృష్టించిన భూపాలపల్లి సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 14 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్న ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 4న హరిబాబు తరఫు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా విచారించిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను 10 కి వాయిదా వేసింది.

డీఎస్పీ సంపత్‌రావుపై అనుమానం ఉంది
– రాజలింగమూర్తి కూతురు నిత్య
తన తండ్రి హత్య కేసు విచారణకు సంబంధించి భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు‌(DSP Sampath Rao)పై తనకు అనుమానం ఉందని రాజలింగమూర్తి కూతురు నిత్య పేర్కొన్నారు. ఈ కేసును తప్పుదోవపట్టించడం వెనక ఆయన కుట్ర ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ‘ఓ కేసు విషయంలో సంపత్ రావు తన గన్ మెన్ ద్వారా మానాన్నను బెదిరించారు. ఈ విషయం నాన్నే మాకు చెప్పారు’ అని నిత్య పేర్కొన్నారు. డీఎస్పీ సంపత్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి(Gandra Venkata Ramana Reddy), హరిబాబు ఫోన్ డాటా(Phone Data) బయటకు తీస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె చెప్పారు. హత్య వెనుక అసలు సూత్రదారులు ఎవరో బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసును సీబీసీఐడీ‌తో విచారణ చేయించాలని కోరారు. ‘హరిబాబును పోలీసులు పట్టుకోకపోవడం.. ఆయనేమో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం చూస్తుంటే అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదు. ఈ కేసు విషయంలో నేను ముఖ్యమంత్రి(CM)ని కలిసి అన్ని విషయాలు వివరిస్తా’ అని నిత్య తెలిపారు.

 

Just In

01

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 32 వేల 520 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు