Tollywood: ఏ ఇండస్ట్రీ అయినా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. విజయం లేనిది ఏది ముందు సాగదు. ఇక చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ లేకుంటే కెరీర్ ముందుకు వెళ్లడం కష్టమే. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి చిత్రంతోనే దూరమైన వారెందరో ఉన్నారు. 1,2 మూవీస్ చేసినప్పటికీ సక్సెస్ అందుకోలేకే ఆఫర్లు రాక డ్రాపౌట్ అయిన హీరో, హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో హీరోయిన్ నీతూ చంద్ర కూడా ఒకరు. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా హిట్స్ లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ బ్యూటీ.
నీతూ చంద్ర.. మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టి, హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గరం మసాలా’ అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత ‘గోదావరి’ అనే మూవీతో నీతూ చంద్ర తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇందులో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇందులో కథానాయికగా కమలినీ ముఖర్జీ నటించగా, మరో ప్రధాన పాత్రలో నీతూ చంద్ర అలరించింది. సుమంత మరదలి రోల్ పోషించి మెప్పించింది. ఈ మూవీలో నీతూ చంద్ర యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆమె అందంతో కుర్రకారులను ఆకర్శించింది.
Also Read ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది!
ఆ తర్వాత ‘సత్యమేవ జయతే’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజశేఖర్, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హట్టర్ ప్లాప్ మూటగట్టుకుంది. ఇక బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు రాకుండా పోయాయి. ఆ తర్వాత హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. 2018లో ‘అంబనవన్ అసరదవన్ అదంగదా’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఇదే ఆమె చివరి చిత్రం కావడం గమనార్హం. ఆ తర్వాత ఈ బ్యూటీ మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఇక మూవీ ఛాన్స్‌లు రాకపోవంతో సినిమాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలోనే బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నీతూ చంద్ర వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. మరోవైపు నీతూ చంద్ర సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. పర్సనల్ విషయాలతో పాటు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. 40 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న ఈ భామ అప్పటికీ.. ఇప్పటికీ ఏం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.