Raa Raja Movie director B Shiva Prasad
ఎంటర్‌టైన్మెంట్

Raa Raja: ప్రయోగం చేశాం, ఆదరించమంటోన్న దర్శకుడు

Raa Raja Director Interview: ప్రస్తుతం రొటీన్ చిత్రాలకు కాకుండా కాస్త కంటెంట్, ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల ఇష్టాన్ని తెలుసుకున్న దర్శకనిర్మాత బి. శివప్రసాద్ ‘రా రాజా’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 7న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవగా దర్శకనిర్మాత బి. శివప్రసాద్ (B Shiva Prasad) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, దర్శకనిర్మాత చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Tamannaah-Vijay varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?

‘‘మాతృ సినిమాతో నేను నిర్మాతగా మారాను. అయితే ఆ సినిమా చేసే సమయంలోనే నాకు ఈ ‘రా రాజా’ మూవీ ఆలోచన వచ్చింది. అలా నేనే నిర్మాతగా, దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను. ప్రస్తుతం ప్రేక్షకులు ఎవ్వరూ కూడా హీరోహీరోయిన్ల పేర్లు, ముఖాలు చూసి సినిమాలకు రావడం లేదు. కరోనా తర్వాత ట్రెండ్ మారింది. కథ నచ్చితే, కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్, కథా ప్రాథాన్యమున్న చిత్రాన్ని తీయాలనే ఉద్దేశ్యంతో ‘రా రాజా’ని ప్రారంభించాను. ఇందులో నటీనటులు ఎవ్వరూ కనిపించకపోయినా, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆడియెన్స్ కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఫీల్ అవుతారు. లవ్, కామెడీ, హారర్ ఇలా అన్నీ ఇందులో ఉంటాయి. సినిమా చూస్తున్న అందరినీ చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.

ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ ఎంతో సపోర్ట్ అందించింది. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ వల్లే ఈ సినిమా చేయగలిగాను. ఆయనతో వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. దర్శకుడికి ఏం కావాలో ఆయనకు తెలిసిపోతుంది. ఆయనతో పని చేసినందుకు ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాకు శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎం మరో ప్లస్ అవుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటారు. ‘రా రాజా’ సినిమాను థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసమే తీశాం. ఈ సినిమా మేకింగ్ కోసం చాలా కష్టపడ్డాం. అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కరినీ నిరాశ పరచదని కచ్చితంగా చెప్పగలను. నటీనటుల ఫేస్‌లు కనిపించడం లేదే? అనే భావనే రాదు. అలా సినిమా చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. మా ఈ ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:
Agent OTT: ఫైనల్లీ ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. ఎన్ని నెలల తర్వాత వస్తుందో తెలుసా?

Bigg Boss: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్