cabinet
తెలంగాణ

SC Classification: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం

SC Classification: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని ముసాయిదా బిల్లు(Draft Bill) తుది మెరుగులు దిద్దాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం(Secretariat)లో మొదలైన కేబినెట్ మీటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపగా..బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్టు సమాచారం వీటితో పాటు మరికొన్ని అంశాలకు ఆమోదముద్ర వేయనున్నారు.

ఎస్సీ వర్గీకరణ

తెలంగాణలో మాల,మాదిగ, డక్కలి… ఇలా 59 ఎస్సీ కులాలున్నాయి. వీరికి రాజ్యాంగం ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ విద్య, ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. కాగా, తెలంగాణలో ఎస్సీలకు మొత్తంగా 15శాతం రిజర్వేషన్ కోటా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఉప కులాలు ఎక్కువగా ఉండటం, అందులో మెరుగ్గా ఉన్న మాలల వంటి కులాలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువ లబ్ధి పొందుతుండటంతో మిగతా వారికి అన్యాయం జరుగుతోంది. జనాభాపరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువ. కానీ రిజర్వేషన్ తాలుకూ ఫలాలు మాలలకే దక్కుతుండటంతో వీటిలో బీసీల్లో ఉన్న మాదిరిగా వర్గీకరణ ఉండాలనే డిమాండ్ అనివార్యమైంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అంగీకరిస్తూ తీర్పునిచ్చింది.

ఈ తీర్పు మేరకే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్దమైంది. దీనికోసం జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గా ఏకసభ్య కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్రంలో ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించింది. మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చింది. వీరికి 1శాతం రిజర్వేషన్ కల్పించింది. ఇక రెండవ గ్రూపులో 18 కులాలను చేర్చింది. వీరికి 9శాతం రిజర్వేషన్ కల్పించింది. మూడో గ్రూపులో కొంచెం మెరుగైన కులాలను చేర్చింది. ఆ మేరకు ఇందులో 26 కులాలను చేర్చింది. వీరికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయనుంది. త్వరలోనే ఈ బిల్లును చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు