Mookuthi Amman 2 Opening: ఎన్ని కోట్లు పెట్టి అయినా సినిమా తీసుకోండి. నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఓపెనింగ్స్‌కి, ప్రమోషనల్ ఈవెంట్స్‌కి మాత్రం రాను. అందుకు అనుగుణంగా రెమ్యూనరేషన్ మాట్లాడుకుందాం.. ఇది స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నయనతార (Nayanthara) తన సినిమాల విషయంలో ఫాలో అయ్యే రూల్. కానీ, ఫస్ట్ టైమ్ నయనతారలో మార్పు వచ్చింది. మూవీ ఓపెనింగ్‌కి ఆమె వచ్చింది. అవును, మీరు వింటున్నది నిజమే. నయనతార మూవీ ఓపెనింగ్‌కు వచ్చింది. ఆమె వస్తుందని కాబోలు మూవీ యూనిట్ రూ. కోటితో నిర్మించిన సెట్‌లో మూవీ ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. మరో విశేషం ఏమిటంటే, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖుష్బూ, మీనాలతో పాటు రెజీనా కసాండ్రా కూడా హాజరయ్యారు. ఫొటోలకు, సెల్పీలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఓపెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సినిమా పేరేంటో చెప్పలేదు.. అని అనుకుంటున్నారా? ‘మూకుతి అమ్మన్ 2’.
Also Read- Tamannaah-Vijay varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?
నయనతార లీడ్ రూల్‌లో సుందర్ సి దర్శకత్వంలో తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తోన్న పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘మూకుతి అమ్మన్ 2’. అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ‘మూకుతి అమ్మన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండగా, మార్చి 6న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేడుకకు కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మరీ ముఖ్యంగా టైటిల్ పాత్రధారి నయనతార, ఈ వేడుకకు హాజరవడంతో అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ‘మూకుతి అమ్మన్’ చిత్రం తెలుగులో ‘అమ్మోరు తల్లి’ టైటిల్‌తో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

అమ్మవారే రప్పించారు
నయనతార ఈ ఓపెనింగ్‌కు హాజరవడంతో, అంతా అమ్మవారి మహిమ అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, అంత సామాన్యంగా ఆమె ఇలాంటి ఈవెంట్స్‌కు రాదు. అమ్మవారి సినిమా కావడంతో పాటు, తను కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న కారణంగానే ఈ వేడుకకు హాజరై ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇషారి కె గణేష్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి భారీ స్థాయిలో విజువల్ వండర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘మూకుతి అమ్మన్ 2’ అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎక్సయిటింగ్ కథాంశంతో వుంటుందని మేకర్స్ చెబుతున్నారు. సుందర్ సి – నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
Agent OTT: ఫైనల్లీ ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. ఎన్ని నెలల తర్వాత వస్తుందో తెలుసా?