Tamannaah-Vijay varma
ఎంటర్‌టైన్మెంట్

Tamannaah-Vijay varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?

Tamannaah-Vijay varma: స్టార్ హీరోయిన్ తమన్నా తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోవడానికి కారణాలివే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట సడెన్‌గా బ్రేకప్ చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలీవుడ్‌లో ‘లవ్ స్టోరీ 2’ అనే వెబ్ సిరీస్‌లో విజయవర్మతో తమన్నా కలిసి నటించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అది కాస్త డేటింగ్ వరకు వెళ్ళింది. ఇద్దరు చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతూ అందరి కంట్లో పడ్డారు. దీంతో ఈ జంట డేటింగ్‌లో ఉందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మొదట్లో తాము ఫ్రెండ్స్ అని, తమ మధ్య ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత విజయ్ వర్మ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. దీంతో మరోసారి మిల్క్ బ్యూటీకి ప్రశ్న ఎదురైంది. ఇక తాము ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని వెల్లడించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా పాల్గొని ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. విజయ్ వర్మతో తమన్నా పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచనే లేదని చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ జంట బ్రేకప్ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు ప్రేమికులుగా విడిపోయిన స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇలా కలిసి ఉండటానికి గల కారణం ఏమై ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే కెరీర్‌, పెళ్లి విషయంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తుంది. తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుందట. అయితే విజయ్ వర్మ మాత్రం కొంత టైం కావాలని కోరినట్టు తెలుస్తుంది. విజయ్ వర్మ కెరీర్ పై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని అంటున్నారు. అందుకే విడిపోయి స్నేహితుల ఉండాలని అనుకున్నారని మాట్లాడుకుంటున్నారు.

Also Read: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

ఇక తమన్నా మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. టాలీవుడ్‌లో టాప్ హీరోలు అందరితో మిల్క్ బ్యూటీ కలిసి నటించింది. తనదైన నటన, అందంతో ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘హ్యాపీ డేస్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ లు కొట్టేసింది. వరుసగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి ఇలా సూపర్ హిట్ మూవీస్ చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?