Ram Gopal Varma
ఎంటర్‌టైన్మెంట్

Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. తనపై నమోదు అయిన కేసుపై హైకోర్టు(Highcourt)స్టే విధించింది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే మూవీలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా చిత్రీకరించారని ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రామ్‌గోపాల్‌ వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను విచారించవద్దని కోరుతూ ఆర్జీవీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2019లో రిలీజైన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. దేంతో ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.

అయితే ఈ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలంటూ రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు అందేజేసింది. ఇటీవల ఈ మూవీ రెచ్చగొట్టేలా ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు వరుసగా ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. దీంతో సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. సీఐడీ విచారణకు మినహాయింపు ఇవ్వాలంటూ కోరుతూ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. తాజా తీర్పుతో రామ్‌గోపాల్‌ వర్మకు ఊరట లభించింది.

Also Read: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

గతంలో ఒంగోలులో సీఐడీ అధికారుల నోటీసులకు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. హైదరాబాద్‌లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరవ్వాలని కోరారు. ఆయన మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎదుట విచారణ హాజరు అయ్యారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కించపరిచేలా పోస్టర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. దీంతో రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు అందజేయడంతో విచారణకు హాజరయ్యారు. మరోసారి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఫిర్యాదు మేరకు సీఐడీ నోటీసులు అందజేయడంతో రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించాడు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు