Aditya Om
ఎంటర్‌టైన్మెంట్

Aditya Om: బిగ్‌బాస్‌పై హీరో ఆదిత్య ఓం సంచలన వ్యాఖ్యలు

Aditya Om: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో‌ బిగ్‌బాస్. 8 సీజన్‌లు సక్సెస్ ఫుల్‌గా ఈ బుల్లితెర షో పూర్తి చేసుకుంది. సీజన్‌-8 సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సీజన్-9 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ షో.. త్వరలో సీజన్-9‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దేశ వ్యాప్తంగా బిగ్‌బాస్ షోకి మంచి ఆదరణ ఉంది. ఎంత క్రేజ్ ఉందో అంతే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో‌ 10 భాషల్లో కోనసాగుతోంది. తొలిసారి హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో దూసుకెళ్తోంది.

ఇదిలా ఉంటే.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ వచ్చిన తెలుగు బిగ్ హౌస్ సీజన్‌-8లో తొలుత 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యే సరికి మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ ఈ షో పాల్గొన్నారు. అయితే సినీ నటుడు ఆదిత్య ఓం కూడా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సడెన్‌గా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సరైన ప్రదర్సన ఇవ్వకపోవడంతో హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్‌బాస్ హౌస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఆదిత్య ఓం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ గురించి ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Also Read: ఫైనల్లీ ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. ఎన్ని నెలల తర్వాత వస్తుందో తెలుసా?

‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే చిత్రంతో తెలుగు తెరకు ఆదిత్య ఓం పరిచయమయ్యాడు. ధనలక్ష్మి ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!, మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి ఇలా అనే మూవీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ సీజన్‌-8 ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు సర్‌ప్రైస్ ఇచ్చాడు. హౌస్‌లో ఆయన ఆటతీరు బాగాలేకపోవడంతెజో హౌస్‌మేట్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. తాజాగా బిగ్‌బాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బిగ్‌బాస్ గురించి ఏమి తెలుసుకోకుండానే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత తెలిసింది బిగ్‌బాస్ అంటే ఏమిటో. లోపల ఒకటి బయట ఒకటి జరుగుతది. అందుకే బిగ్‌బాస్ అంటే నచ్చలేదు. ఒకసారి ఎలిమినేషన్ కూడా అలాగే జరిగింది. కావాలనే టార్గెట్ చేసి మరి బయటికి పంపించారు. నా జీవితంలో ఓ బ్యాడ్ ఎక్స్‌పెరియన్స్ బిగ్‌బాస్ హౌస్‌లో ఫేస్ చేశాను.’ అని పేర్కొన్నాడు. ఈ విధంగా బిగ్‌బాస్ గురించి తన ఒపీనియన్ ఆదిత్య ఓం చెప్పుకొచ్చాడు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?