Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ‘RC 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రం షూటంగ్ జరుగుతోంది. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఉత్తరాంధ్రా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ షూటంగ్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవలే మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ మూవీలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ కీలక రోల్ పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవలే మూవీ యూనిట్ శివన్న లుక్ టెస్ట్‌ని కూడా పూర్తి చేసింది. నెక్స్ట్ షెడ్యూల్‌లో శివన్న షూటింగ్‌లో జాయిన్ అయితారని వెల్లడించారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ మెయిన్ రోల్ పోషిస్తాడని అంటున్నారు. ఆస్కార్ విజేత మ్యూజికల్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తుండటం విశేషం. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
మరోవైపు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఈ మూవీకి సంబంధించిన కీలక సీన్స్ చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ రామ్ చరణ్ పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అయితే పార్లమెంట్ భవనంలో చిత్రీకరణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే ఇంకా పర్మిషన్ రాలేదని తెలుస్తుంది. పార్లమెంట్ భవనం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు సమాచారం. అలాగే ఢిల్లీలోని జమా మసీద్ వద్ద కొన్ని సీన్స్ షూటింగ్ చేయాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. రంజాన్ పండగ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఎక్స్‌పెక్టషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ మూవీతో నిరాశ చెందిన రామ్ చరణ్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.