| Revanth Reddy: 'బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి'.. సీఎం
Revanth Reddy
Telangana News

Revanth Reddy: ‘బీజేపీ, బీఆర్ఎస్ కలిసే డ్రామాలు ఆడుతున్నాయి’.. సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వనపర్తిలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ బాలుర కాలేజీ మైదానంలో పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు. ఆపై కేడీఆర్ కాలేజీలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. విపక్షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘బీఆర్ఎస్.. ఎందుకు రుణమాఫీ చేయలేదు’

వనపర్తిలోని కేడీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2014-2024 మధ్య కేసీఆర్ సీఎంగా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా పనిచేశారు. బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో ఎందుకు రుణ మాఫీ చేయలేకపోయింది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా రుణమాఫీ జరిగిందా? లేదా?’ అంటూ రేవంత్ నిలదీశారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా కరెంట్ కోతలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు.

Also Read: Summer Drinks: సమ్మర్ స్పెషల్.. చెరుకు రసం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అంతకుముందు వనపర్తి పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులు అట్టహాసంగా ప్రారంభిస్తారు. అలాగే వనపర్తి ఐటీ టవర్స్‌ , నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. వాటితో పాటు పెబ్బేరులో 30పడకల హాస్పటల్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అలాగే స్థానిక ZPHS, జూనియర్ కళాశాలలో అభివృద్ది పనులకు శిలాఫలకములను సీఎం ఆవిష్కరించారు.

 

 

Just In

01

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!