Sandeep Reddy Vanga
ఎంటర్‌టైన్మెంట్

Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ: సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ మూవీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీతో దేశ వ్యాప్తంగా సందీప్ రెడ్డి వంగా పేరు మార్మోగిపోయింది. ఆయన తీసిన మూవీస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేశాడు. అక్కడ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా క్రేజ్ మరింత పెంచింది. గతేడాది యానిమల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా యాక్ట్‌ చేశారు. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే ఈ మూవీపై పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒక ఐఏఎస్ సైతం విమర్శించడం అప్పట్లో హాట్‌టాపిక్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

అయితే ఐఏఎస్‌ అధికారి వికాస్‌ దివ్యకీర్తి అనే వ్యక్తి ‘కబీర్ సింగ్’ మూవీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇలాంటి చిత్రాలు సమాజాన్ని 10 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్తున్నాయని ఆరోపించాడు. యానిమల్‌ లాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. ఈ సినిమలో హీరో ఓ యానిమల్ లాగా ప్రవర్తించాడని వెల్లడించారు. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల భారీగానే డబ్బు రావొచ్చని, కానీ డబ్బు గురించి ఆలోచిస్తే.. సామాజిక విలువల సంగతి ఏంటని ప్రశ్నించారు.

Also Read: హీరో తరుణ్‌తో ప్రియమణి లవ్.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్? 

ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యలపై తాజాగా సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఓ ఐఏఎస్‌ అధికారి యానిమల్‌ లాంటి మూవీస్ తీయొద్దని చెప్పడం.. తనకు ఏదో పెద్ద నేరం చేసినట్టు అనిపించిందని పేర్కొన్నాడు. ఇలా ఆయన వ్యాఖ్యలు చేయడం మనసుకు బాధనిపించిందని తెలిపాడు. ఆ అధికారి అనవసరంగా తన సినిమా గురించి తీవ్ర విమర్శలు చేశాడని పేర్కొన్నాడు. ఆ సమయంలో కోపం వచ్చిందని, ఒక్కటే అర్థం చేసుకున్నానని చెప్పాడు. ఆయన బాగా కష్టపడి చదువుకుని ఐఏఎస్‌ అయ్యాడని తెలిపాడు. ఎవరైనా రెండుమూడేళ్లు కష్టపడి 1500 పుస్తకాలు చదివితే ఈజీగా ఐఏఎస్ అవుతారని, అదే ఫిల్మ్‌ మేకర్‌ లేదా రచయిత కావాలంటే అంతా ఈజీ కాదన్నారు. ఇవి చేసేందుకు ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరని, మనకు మనమే అభిరుచితోనే ముందుకు సాగాలని తెలిపాడు. ఇదే పేపర్ మీద కూడా రాసివ్వాలని చెప్పినా రాసి ఇస్తానని పేర్కొన్నాడు. ఇక తను ప్రభాస్‌తో తీయబోయే ‘స్పిరిట్‌’ గురించి మాట్లాడారు. ఈ మూవీ బాహుబలి రికార్డు బ్రేక్ చేయాలంటే రూ. 2 వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టాలని తెలిపాడు. ఇది పెద్ద విషయమే అని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలు అన్ని కూడా మంచిగానే తీశాననే నమ్మకం ఉందని చెప్పాడు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ