Tg Rtc : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇక నుంచి హైదరాబాద్ బస్సుల్లో (Bus) ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ ఎంతగా పెరిగిపోయాయో మనకు తెలిసిందే. అంతా ఆన్ లైన్ (Online) విధానం ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఇంకా పూర్తిగా అమలు కావట్లేదు.
మొదట్లో కొన్ని రూట్లలోనే దీన్ని తీసుకొచ్చింది ఆర్టీసీ. అయితే నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే సిటీ బస్సుల్లో మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ సిటీ బస్సుల్లో కూడా ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మొదలుపెట్టింది. యూపీఐ పేమెంట్స్ తో టికెట్లు తీసుకుంటే కండక్టర్లకు చిల్లర ఇచ్చే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.