Seethakka
తెలంగాణ

Seethakka : లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్ లో సభః మంత్రి సీతక్క

Seethakka : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ (Pared Ground) లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. మహిళల కోసం ఆర్జీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభిస్తారని.. దానికి తోడు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కూడా అందజేస్తారన్నారు.

ఏడాది కాలంలో మరణించిన మహిళల కుటుంబాలకు రూ.40 కోట్ల బీమా చెక్కులను కూడా అందజేస్తారని సీతక్క తెలిపారు. 32 జిల్లాల్లో 64 వాట్ల విద్యుత్ సోలార్ ప్లాంట్లను వర్చువల్ గా సీఎం రేవంత్ ప్రారంభిస్తారని సీతక్క చెప్పుకొచ్చారు. మహిళల ఆర్థిక వృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా స్కీములు అమలు చేస్తుందంటూ వివరించారు.

ఇందిరా గాంధీ మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్ విడుదల చేస్తారన్నారు. అలాగే అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంక్ లను కూడా మహిళా సంఘాలతో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!