Ravanth Reddy : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం కొత్త కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వచ్చేశాయి. ఇప్పటికే మహిళల కోసం ఆర్టీసీ (Rtc) ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ పథకాలను అందిస్తోంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో (Pared Grounds) కొత్త పథకాలను ప్రారంభిచబోతోంది.
ఇందులో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలతో ప్రారంభించబోతోంది. ముందుగా 50 బస్సులను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత బస్సలు సంఖ్యను పెంచుకుంటూ పోతారు. దీనికి తోడు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కూడా అందజేయనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకోబోతోంది ప్రభుత్వం. ఇవే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ధీరా మహిళా శక్తి 2025 విడుదల చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా 15వేల అంగన్వాడీ, టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ సీఎం విడుదల చేయనున్నారు.