Shanmukha: ‘కార్తికేయ’ చిత్రం తర్వాత ప్రేక్షకులు డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఎంతగా ఇష్టపడుతుంటారనేది సినిమా వాళ్లకు బాగా తెలిసివచ్చింది. అందుకే ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా సంచలనంగా మారింది. ‘కార్తికేయ3’ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా వచ్చే లోపు అలాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌తో నేను వస్తున్నానంటున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. ఆది సాయికుమార్ (Adi Saikumar) సరసన చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (Avika Gor) హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఎలా ఆదరిస్తుంటారో తెలుసుకున్న దర్శకుడు షణ్ముగం సాప్పని, ఓ అద్భుతమైన కథతో ఈ సినిమాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్
‘శాసనసభ’ నిర్మించిన బ్యానర్‌లో
‘శాసనసభ’ అనే పాన్ ఇండియా సినిమాతో సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ (Sapbro Productions) సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ ‘షణ్ముగ’ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది.. ఈ సినిమా ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుందని. పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎవరూ టచ్ చేయని పాయింట్
చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ.. ‘షణ్ముఖ’ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది సాయికుమార్ కనిపిస్తాడు. ఇప్పటి వరకు వెండితెరపై ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపుదిద్దుకుంటోన్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. విజువల్ వండర్‌లా, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఓ ప్రత్యేక ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్ అనేలా వుంటుంది. ప్రేక్షకులందరూ తమ ఫ్యామిలీలతో చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇది. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి స్టన్నింగ్ మ్యూజిక్ ఇస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా టీమ్ అంతా ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా హీరో ఆది కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుందని చెప్పగలనని అన్నారు.