Dhee Show : ఢీ షో డ్యాన్సర్ మోసం చేశాడంటూ ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో 24 ఏళ్ల కావ్య కళ్యాణి (Kavya Kalyani) సూసైడ్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఉరేసుకుంది. తనను ఢీ షో డ్యాన్సర్ అయిన అభి (Abhi) ఐదేండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. తనతో కాపురం చేస్తూనే ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ అందులో తెలిపింది. తనను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటూ బెదిరించడంతో తట్టుకోలేక చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢీ షోకు తెలుగు నాట ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆ షో నుంచి ఎంతో మంది స్టార్ కొరియోగ్రాఫర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి షో డ్యాన్సర్ మోం చేయడంతో కావ్య కళ్యాణి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దీంతో ఈ షో మీద ఆ షోలో చేసే డ్యాన్సర్ల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.